హుజురాబాద్ ఉపఎన్నికల్లో హోరాహోరీ నడుస్తోంది. అయితే తక్కువలో తక్కువ అయినా ప్రతి రౌండ్లోని బీజేపీ అభ్యర్థినే ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పోలైన ఓట్లన్నీ దాదాపుగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులే పంచుకున్నారు. బరిలో ఉన్న మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ మాత్రం కనీస ఓట్లు సాధించలేకపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా గుంపగుత్తగా ఈటల వైపు వెళ్లినట్లుగా కనిపిస్తోంది. ఈ ఓట్ల బలంతోనే టీఆర్ఎస్ను ఈటల సులువుగా ఎదుర్కొంటున్నారు.
ఎంత హోరా హోరీ పోరు జరిగినా కాంగ్రెస్ పార్టీకి కనీసం పది శాతం ఓట్లు అయినా వస్తాయని అంచనా వేశారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ – బీజేపీ కలిసి టీఆర్ఎస్పై కుట్ర పన్నాయని కేటీఆర్ చాలా రోజులుగా ఆరోపిస్తున్నాయి. కుట్ర పన్నాయో లేదో కానీ టీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఓట్లు ఈటల వైపు మొబిలైజ్ కావడానికి టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా ఓ కారణం అని చెప్పుకోవచ్చు. హుజురాబాద్లో గతంలో బీజేపీకి నోటాతో పాటుగా కూడా ఓట్లు వచ్చేవి కావు. కానీ ఈసారి విజయం దిశగా సాగిందంటే.. ఈటల రాజేందర్ పరపతికి తోడు కాంగ్రెస్ సాయం కలసి వచ్చిందనుకోవాలి.