`ఫ్యామిలీమెన్ 2`లో సరికొత్త సమంతని చూశాం. తన యాక్షన్ సీక్వెన్స్ చూసి థ్రిల్ అయ్యారు ప్రేక్షకులు. ఇప్పుడు `యశోద`లోనూ యాక్షన్ సీన్స్ గట్టిగానే డిజైన్ చేశార్ట. సమంత చేస్తున్న సినిమా `యశోద`. ఇదో లేడీ ఓరియెంటెడ్ చిత్రం. పేరు సాఫ్ట్ గా ఉన్నా – లోపల కంటెంట్ మాత్రం యాక్షన్ ప్యాక్డ్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో 3 యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నాయట. మూడూ వేటికవి భిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ఓ యాక్షన్ సీన్‌ని `ఫ్యామిలీమెన్`టీమ్ కి పనిచేసిన ఫారెన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేశారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండబోతోందని తెలుస్తోంది. ఫ్యామిలీమెన్ 2కి పనిచేసిన యాక్షన్ మాస్టర్లే ఈ సినిమాకి కావాలని సమంత డిమాండ్ చేయడంతో.. నిర్మాతలు వాళ్లది దిగుమతి చేయాల్సివచ్చింది. క్లైమాక్స్ కి ముందు ఓ భారీ యాక్షన్ సీన్ ఉంటుందని అందులో… సమంత పోరాటాలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయని తెలుస్తోంది. ఈసినిమాలో సమంతకు సంబంధించి ఓ లుక్ బయటకు వచ్చానా, సర్ప్రైజింగ్ లుక్ మరోటి ఉంటుందని, దాన్ని త్వరలోనే వదులుతారని తెలుస్తోంది.ఈ సినిమా కోసమే.. సమంత జిమ్ లో బాగా కష్టపడింది. స్పెషల్ గా ట్రైనింగ్ కూడా తీసుకొంది. మరి ఆ యాక్షన్ ఫీట్లు ఏ రేంజులో ఉంటాయో చూడాలి.