నాని నటిస్తున్న యాక్షన్ డ్రామా `దసరా`. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. పక్కా తెలంగాణ నేపథ్యంలో బొగ్గుగని కార్మికుడిగా నాని నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్
ఈ సినిమా నుండి తొలిపాట ధూమ్ ధామ్ ధోస్థాన్ విడుదల చేశారు, మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ గా మాస్ ని క్రియేట్ చేసేలావుందీ పాట. నాని క్యారెక్టర్ లుక్, మేకోవర్కి మునుపెన్నడూ చూడని విధంగా వుంది. నాని, అతని బ్యాచ్ అద్భుతమైన, డైనమిక్ డ్యాన్స్ మూవ్స్ తో బొగ్గు గనులలో దుమ్ము రేపారు సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి పాడారు. తెలంగాణా స్టైల్లో కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు. 30 మార్చి 2023న ఈ సినిమా విడుదల కానుంది.