ఆంధ్రప్రదేశ్ లో ఫాక్స్ కాన్ మెగా ఇండస్ట్రియల్ సిటీని పెట్టేందుకు ప్రణాికలు సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఫాక్స్ కాన్ బృందం అమరావతికి వచ్చి నారా లోకేష్‌తో సమావేశం అయింది. ఈ సందర్భంగా వారి మధ్య కీలక చర్చలు జరిగాయి. ఫాక్స్ కాన్ ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటకల్లో పెట్టుబడుల ప్రతిపాదనలతో తమ ప్రతినిధి బృందాన్ని ఇండియాకు పంపింది. ఇప్పటికే ప్రధానితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాష్ట్రాలను సందర్శిస్తున్నారు.
అమరావతిలోని ఉండవల్లి నివాసానికి వచ్చిన ఫాక్స్ కాన్ బృందానికి నారా లోకేష్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఏపీలో ఉన్న పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు. ఈవీ వాహనా రంగంలోకి రావాలని ఫాక్స్ కాన్ ప్రయత్నిస్తోంది. ఈవీలతో పాటు సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో.. ప్రత్యేకంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలను ప్రకటించి ప్రోత్సాహకాలు అందిస్తామని లోకష్ వారికి హామీ ఇచ్చారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఏపీలో పెట్టుబడులకు సుముఖంగా ఉన్నామని ఫాక్స్ కాన్ బృందం.. నారా లోకేష్‌కు తెలిపింది. చర్చలు అర్థవంతంగా జరగడంతో… ఫాక్స్ గ్రూప్ నుంచి త్వరలో ఏపీలో పెట్టుబడుల అంశంపై ఓ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్వయంగా ఓ ఇండస్ట్రియల్ మెగాసిటీని ఫాక్స్ కాన్ రెడీ చేసే అవకాశం ఉండటంతో..పెట్టుబడుల సామర్థ్యం భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.