జనసేన అధినేత పవన్ కల్యాణ్ నర్సాపురంలో మత్స్యకారుల అభ్యున్నతి సభ నిర్వహించి జీవో నెం. 217 చించి వేసిన అంశం కలకలంరేపు తోంది. వెంటనే ప్రభుత్వం తరపున ఓ అధికారి ప్రెస్ మీట్ పెట్టి జీవో 217పై దుష్ప్రచారం అని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 27,360 చెరువుల్లో మత్స్య సంపద పెంచుకునేందుకు అవకాశం ఉందని.. వీటిలో న్నారు. వంద హెక్టార్ల కంటే ఎక్కువ ఉన్నవి కేవలం 582 చెరువులేనన్నారు. వాటినే ప్రభుత్వం జారీ చేసిన జీవో వాటికే వర్తిస్తుందని స్పష్టం చేశారు. వాటినే వేలం వేస్తున్నామని చెప్పుకొచ్చారు.
పవన్ కూడా అదే చెప్పారు. మత్స్యకారులు సైలెంట్‌గా ఉంటే తర్వాత చిన్నచెరువులు కూడా ఇచ్చేస్తారని మత్స్యకారుల పొట్టకొడతారని హెచ్చరించారు. చెరువులు, డ్యాముల్లో ఇప్పటి వరకూ మత్స్యకార సొసైటీలకు చేపలు పట్టుకునే అవకాశం కల్పించేవారు. కానీ 217 జీవో ద్వారా బహిరంగ వేలానికి వెళ్లాలని నిర్ణయించారు. నెల్లూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి 27 రిజర్వాయర్లలో బహిరంగ వేలానికి వెళ్లారు. తీరప్రాంత గ్రామాల్లో చిన్నచిన్న చెరువులు మాత్రమే సొసైటీల పరిధిలోకి వస్తున్నాయి.
వందల ఎకరాల చెరువులు, ట్యాంక్‌లు సొసైటీల పరిధిలో లేకుండా జీవో ద్వారా తొలగించారు వాటిపై వస్తున్న ఆదాయం దళారుల పాలవుతోందని అందుకే ఈ నిరణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.వైసీపీ నేతలు దోచుకునేందుకు కట్టబెట్టడానికే ఈ జీవో తెచ్చారమని మత్య్సకారులు ఆందోళనకుదిగుతున్నారు. అన్నిపార్టీలూ ఈ జీవోను రద్దు చేయాలంటున్నాయి. అయితే ఈ జీవో వల్ల మత్స్యకారులకు మేలు అంటున్న ప్రభుత్వం .. ఎలాంటి మేలో చెప్పడంలేదు . బహిరంగ వేలానికి వెళ్తే ఎవరైనా పాడుకుంటారు. నష్టపోయేది మాత్రం మత్స్యకారులేనంటున్నారు.