తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేయడం తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతోంది. తెలంగాణ హైకోర్టు… తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని తేల్చింది. ఆర్టికల్ 14,19 1(d) ప్రకారం అంతర్ రాష్ట్ర సరిహద్దుల నుండి అంబులెన్స్ లను నిలిపి వేసి ఉల్లంఘన కు పాల్పడిందని తేల్చింది. నిజానికి అంబులెన్స్‌ల సమస్య పరిష్కారం అయిందని ఏపీ సర్కార్ ప్రకటించింది. అర్థరాత్రి నుంచి అందర్నీ అనుమతిస్తున్నారని చెప్పింది. కానీ సమస్య పరిష్కారం కాలేదు. హైదరాబాద్ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖరారు చేసుకున్న వారికి మాత్రమే అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు. సరిహదుల్లో ఇప్పటికీ పెద్ద ఎత్తున అంబులెన్స్‌లు నిలిచి ఉన్నాయి.
ఈ విషయంపై హైకోర్టుకు సమాచారం అందడంతో సీరియస్ అయింది. ఆర్ఎంపీ వైద్యుల ప్రిస్క్రిప్షన్‌తో ఇక్కడికి వస్తున్నారని ందుకే ఆపేస్తున్నాని ఏజీ ధర్మాసనానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ విరవణపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేయలేదు. హైదరాబాద్ అనేది మెడికల్ హబ్ .. ఆరోగ్యం కోసం ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారు..రావొద్దని చెప్పడానికి మీకు ఏం అధికారం ఉందని సూటిగా ప్రశ్నించారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అంతర్జాతీయ పేషెంట్లు ఉంటారు.. వాళ్లను కూడా ఇలానే అడ్డుకుంటారా అని మండిపడింది. రేపటిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని అడ్వకేట్ జనరల్ చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని హైకోర్టు వ్యాఖ్యానించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. రేపట్నుంచి లాక్ డౌన్ విధింపుతో సహజంగానే ఆంక్షలు అమల్లోకి వస్తాయి. పర్మిషన్ తీసుకున్న అంబులెన్స్‌లకే అనుమతి ఇస్తారు. హైదరాబాద్ దవాఖానాల్లో ఇతర రాష్ట్రాల వారు చికిత్స పొందకుండా.. తెలంగాణ హైకోర్టు చేసిన ప్రయత్నం వల్ల.. తెలంగాణ శివారు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇ్బబందులు పడటం ఖాయంగా కనిపిస్తోంది.