అనారోగ్యం కారణాలు చెప్పినా వైఎస్ భాస్కర్ రెడ్డికి దొరకని బెయిల్ !

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. వైఎస్ భాస్కర్ రెడ్డికి 70ఏళ్లు పైనే ఉంటాయని.. ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. ఆయన పై ఆరోపణలకు ఆధారాల్లేవని.. బెయిల్ ఇవ్వాలని చేసిన వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు.

ఎంపీ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయడంపై వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ కోరింది. వైఎస్ వివేకా హత్యకు ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర చేశారని సీబీఐ అఫిడవిట్‌లో తెలిపింది.

రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ మరోమారు అఫిడవిట్‌లో తేల్చి చెప్పింది.ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని మరింత విచారించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ వివేకా హత్య జరిగితే గుండెపోటు అని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసింది. వైఎస్ వివేకానందరెడ్డితోపాటు కారులో వెళ్లిన నిందితుడు గంగిరెడ్డి ఎంపీ అవినాశ్ రెడ్డికి ఫోన్ చేశారని..అదే సమయంలో అవినాశ్ రెడ్డి ఇంట్లోనే సునీల్ యాదవ్ సైతం ఉన్నారని సీబీఐ తన అఫిడవిట్‌లో పేర్కొంది. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి, ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి మాత్రమే ప్రస్తుతం వివేకా హత్య కేసులో బయట ఉన్నారు. మిగతా వారంతా జైల్లో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close