రాజ్యాంగం, చట్టాలను కాదని ఏం చేయాలనుకున్నా మధ్యలో బోర్లా పడిపోవడం ఖాయం. విశాఖకు కార్యాలయాలను తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న జగన్ రెడ్డి సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతోంది. తన సతీమణి పుట్టిన రోజును.. కొత్త ప్యాలెస్ లో జరుపుకుందామనుకున్న జగన్ రెడ్డికి పరిస్థితిలు కలిసి రాలేదు. ఇప్పుడు అసలు ఎన్నికల్లో వెళ్తారో లేదో అన్న పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే.. విశాఖకు కార్యాలయాలను తరలించబోమని హైకోర్టుకు రాసిచ్చారు. విశాఖకు కార్యాలయాలను హైకోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ తరలించబోమని ఏపీ ప్రభుత్వ లాయర్ హైకోర్టుకు తెలిపారు.
క్యాంపు కార్యాలయాల ముసుగులో విశాఖపట్నానికి రాజధాని తరలింపు పిటిషన్పై విచారణ జరిగింది రోస్టర్ ప్రకారం బెంచ్ ముందుకు పిటిషన్ వచ్చిందని, విచారించిన తర్వాతే ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో దీనిపై మధ్యంతర పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు న్యాయమూర్తి సూచించారు. రాజధాని వ్యవహారాలను విచారించే త్రిసభ్య ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోతే తానే విచారిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం తరఫు న్యాయవాది అంగీకారం తెలిపారు. ఈ లోపు ప్రభుత్వం కార్యాలయాలను తరలించేందుకు ప్రయత్నిస్తుందని, మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోరారు. కార్యాలయాల తరలింపు ఇప్పటికిప్పుడు ఏమీ జరగదని, అది సుదీర్ఘ ప్రక్రియ అని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
ప్రభుత్వం ఇలానే చెప్పి కార్యాలయాలు తరలించేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ…. కార్యాలయాల తరలింపు ఉండదని ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన ఆదేశాలు తీసుకోవాలని అడ్వొకేట్ జనరల్ కు సూచించింది. అనంతరం కేసు విచారణ హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. విచారణ పూర్తయ్యే వరకూ ఆఫీసుల్ని తరలించలేరన్నమాట.