లవ్ స్టోరీ విడుదల మరోసారి సందిగ్థంలో పడింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రమిది. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. సెప్టెంబరు 10 విడుదల చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడు 10న వస్తుందా, రాదా? అనే సందేహాలు మొదలయ్యాయి.
ఎందుకంటే సరిగ్గా 10నే ఓటీటీలో `టక్ జగదీష్` విడుదల అవుతోంది. మరోవైపు నితిన్ `మాస్ట్రో` కూడా అదే రోజున ఓటీటీలోకి వస్తోంది. రెండు సినిమాలు ఒకేసారి ఓటీటీలోకి రావడం, రెండూ క్రేజ్ ఉన్న సినిమాలే కావడంతో.. `లవ్ స్టోరీ` చూడ్డానికి జనాలు థియేటర్లకు వస్తారా, రారా? అనేది పెద్ద డౌట్. శేఖర్ కమ్ముల సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులు మక్కువ చూపిస్తారు. అదే రోజున ఓటీటీలో సినిమా ఉంటే.. ఫ్యామిలీ అడియన్స్ థియేటర్లకు రావడం కష్టం. అందుకే.. లవ్ స్టోరీ ని ఓ వారం ముందుకో, ఓ వారం వెనక్కో జరపాలని భావిస్తున్నారు. ఈ రోజు లవ్ స్టోరీ యూనిట్ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసింది. రిలీజ్ డేట్ విషయంలో ఈ సాయింత్రానికల్లా ఓ నిర్ణయానికి రావొచ్చు.