ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ రకాల్లో అత్యంత ప్రమాదకర రకాన్ని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. N-440Kగా పిలిచే ఈ రకం వైరస్ ఆనవాళ్లు.. కర్నూలు కోవిడ్ పేషంట్లలో కనిపించాయి. ఇతర వైరస్ల కన్నా 10 రెట్లు N-440K వైరస్ ప్రభావం చూపుతుందని అంచనా అంచనా వేశారు. ఏపీలో మరణాలు అనూహ్యంగా పెరిగిపోతూండటం… కేసుల సంఖ్య పెరగడం… రికవరీలు తగ్గిపోవడంతో… ప్రమాదకరమైన మ్యూటేషన్లు ఏపీలో విస్తరించినట్లుగా అనుమానిస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. పగటి పూట కూడా కర్ఫ్యూ పెట్టాలని నిర్ణయించింది.
ఐదో తేదీ నుంచి రెండు వారాల పాటు… కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. ఇప్పుడు పగటి పూట కూడా.. కర్ఫ్యూ అమలు చేస్తారు. ఉ.6 గంటల నుంచి మ.12 గంటల వరకు దుకాణాలకు దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఆ సమయంలోనూ 144 సెక్షన్ అమలు చేస్తారు. అత్యవసర సేవలకు మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. ఏపీ ఆస్పత్రుల్లో హాహాకారాలు వినిపిస్తున్నాయి. పది మంది.. ఇరవై మంది చనిపోతున్నారు. ఆక్సిజన్ కొరత వల్లేనని.. మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
అయితే ఆక్సిజన్ కొరతే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరో వైపు ఆక్సిజన్ విదేశాల నుంచి అయినా సరే కొనుగోలు చేయాలని సీఎం జగన్ అధికారుల్ని ఆదేశించినట్లుగా ప్రెస్ నోట్లు విడుదలవుతున్నాయి. మొత్తంగా చూస్తే ఏపీలో కరోనా పరిస్థితి.. బయటకు చెప్పనంత తీవ్రంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.