కోడికత్తి కేసులో ఎన్ఐఏ చేసిన దర్యాప్తు చాలదని ఇంకా లోతైన దర్యాప్తు చేయాలంటూ ఏపీ సీఎం జగన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టేసింది. గతంలోనే ఎన్ఐఏ విచారణ పూర్తి చేసింది. దాడిలో కుట్ర కోణం లేదని తేల్చింది. జగన్ రెడ్డి కి ఎన్నికల్లో సానుభూతి రావడానికే అలా చేశాడని తేల్చింది. అయితే ఇది సరిపోదని.. ఈ కోడికత్తి దాడి వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని.. ఎన్ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదని.. తాము చెప్పినట్లుగా దర్యాప్తు చేయాలని జగన్ రెడ్డి పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ సమయంలో ఇరు వర్గాల వాదనలు విన్న ఎన్ఐఏ కోర్టు జగన్ పిటిషన్ పస లేదని.. ఎన్ఐఏ లోతుగా దర్యాప్తు జరిపిందని నిర్ధారించుకుని పిటిషన్ ను కొట్టి వేసింది. ఈ కేసులో జగన్ తరపున వాదనలను ఇన్ హౌస్ లో వినిపించారు. నిజానికి ఈ కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తూంటే..కోర్టుకు వెళ్లీ మరీ ఎన్ఐఏ దర్యాప్తు తెచ్చుకుంది జగన్ రెడ్డే. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ రెడ్డి కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించారు. కేంద్రం ఎన్ఐఏ విచారణకు ఉత్తర్వులు ఇచ్చింది. అంతకు ముందే కోర్టును కూడా ఆశ్రయించారు. చివరికి ఎన్ఐఏ విచారణ జరిపింది. కానీ ఇప్పుడు ఆ ఎన్ఐఏ విచారణలో తాము చెప్పినట్లుగా రాలేదని .. మళ్లీ లోతైన విచాణ అంటూ పిటిషన్లు వేస్తున్నారు.
మరో వైపు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోర్టులో మగ్గిపోతున్నారు. బెయిల్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. జగన్ రెడ్డి అభ్యంతరం లేదని చెబితే బెయిల్ ఇస్తారు.. కానీ ఆయన స్పందించడం లేదు. జగన్ కు సానుభూతి రావాలని ..సీఎం కావాలని ఆయన డ్రామా ఆడితే.. జగన్ సీఎం అయ్యారు కానీ.. కోడికత్తి శీను మాత్రం. జగన్ అధికారంలో ఉన్నంత కాలం జైలు జీవితానికి పరిమితమవుతున్నారు.