కొరియో గ్రాఫర్ జానీ తాను తన అసిస్టెంట్ ను మైనర్ గా ఉన్నప్పటి నుంచి రేప్ చేశారని అంగీకరించారని కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ ప్రచారాన్ని చూసి చాలా మంది నమ్మేశారు. నిజానికి పోలీసులు రిమాండ్ రిపోర్టును మాత్రమే ప్రవేశ పెట్టారు. తాము అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నాం కాబట్టి… తమ వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేకపోతే పోలీసులు నిందితుడు నేరం అంగీకరించారని రిమాండ్ రిపోర్టులో చెబుతారు. పోలీసులు తమ కస్టడీలో తీసుకునే దానికి రాసుకునేదానికి ఏ మాత్రం వ్యాలిడిటీ ఉండదు. ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాలను కూడా నేరాంగీకారం పేరుతో ట్విస్ట్ చేసి ప్రచారం చేస్తున్నారు.
ఫిర్యాదు దారు చెప్పిన విషయాలనే… ఎక్కువగా రిమాండ్ రిపోర్టులో పెట్టారు. పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేసి తేల్చిందేమీ లేదు. మొత్తం బాధితురాలు చెప్పిందని చెప్పారు . నేరం జానీ అంగీకరించారని చెప్పడం ద్వారా దానికి వ్యాలిడేషన్ తెచ్చే ప్రయత్నం చేశారని చెట్టు కింద ప్లీడర్ అయినా చెబుతారు. కోర్టుకు వచ్చిన సమయంలో జానీ మాస్టర్ … తనను కావాలని ఇరికించారని.. తాను ఏ తప్పు చేయలేదన్నారు. అలా చెప్పిన జానీ.. పోలీసుల ముందు తాను రేప్ చేశానని ఎలా అంగీకరిస్తారన్న ప్రశ్న ఎవరికీ రాలేదు.
జానీ కేసు విషయంలో … అంతా గందరగోళంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అసలు దాని కన్నా చిలువలు పలువలుగా చేస్తున్న ప్రచారం ఎక్కువ గా జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి జానీకే మద్దతు లభిస్తోంది. అసలేం జరిగిందో ఇండస్ట్రీలో ఉన్న వారికన్నా బయట వారికి ఎక్కువ తెలుస్తుందా అన్న ప్రశ్నలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి.