పవన్ కల్యాణ్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో సమావేశం కావడం వెనుక కారణం ఏమిటో మాత్రం క్లారిటీ రాలేదు. కేబినెట్ సమావేశం తర్వాత ఢిల్లీ వెళ్లిన పవన్ దాదాపుగా అరగంట సేపు అమిత్ షాతో చర్చలు జరిపారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కానీ .. ఏ ఏ అంశాలపై చర్చలు జరిపారో అన్న విషయంపై ఎలాంటి హింట్ ఇవ్వలేదు.కానీ సహకరిస్తున్నందుకు మాత్రం కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో రెచ్చిపోతున్న సోషల్ మీడియా సైకోల సంగతి చూడాలని బలంగా నిర్ణయించుకున్న అంశాన్ని పవన్ కల్యాణ్ ప్రధానంగా అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని అంటున్నారు.సోషల్ మీడియా స్వేచ్చ అంటే కుటుంబంలో ఆడవాళ్లపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమేనని అనుకుటున్నారని అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సి ఉందని వివరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై అమిత్ షా కూడా..త చట్టాలను ఉల్లంఘించే ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లుగా చెబుతున్నారు.
పూర్తిగా రాజకీయ అంశాలపైనే పవన్ పర్యటన సాగిందని.. ఇందులో తన శాఖలకు సంబంధంచి ఎలాంటి చర్చలు జరగలేదని చెబుతున్నారు. సమావేశం ముగిసిన తర్వాత పవన్ ఎవరితోనూ సమావేశం కాలేదు. నేరుగా మళ్లీ విజయవాడ బయలుదేరి వచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సారి ఢిల్లీ వెళ్లిన పవన్ సింపుల్గా అమిత్ షాతో భేటీ అయి తిరిగి వచ్చేశారు.