చైనాలో 150 కోట్ల మంది జనాభా ఉంటారు. ఇప్పుడు మన దేశంలో చైనా కంటే ఎక్కువ జనాభా. కానీ మన దేశంలో కనిపించని చిత్ర విచిత్రాలన్నీ చైనాలో కనిపిస్తూంటాయి. అక్కడ భవనాల మీద నుంచి మెట్రోలు.. అపార్టుమెంట్లలోనే మెట్రో స్టాపులు వంటివి సోషల్ మీడియాలో చాలా చూసి ఉంటాం. ఇప్పుడు మరో విచిత్రాన్ని సోషల్ మీడియా వెలుగులోకి తెచ్చింది. అదేమిటంటే ఓ నగరం మొత్తం ఒక అపార్టుమెంట్లో ఉండటం.
మన దేశంలో 30వేల మంది జనాభా నివాసం ఉంటే దాన్ని మున్సిపాల్టీగా ప్రకటించేందుకు వెనుకాడరు. ఈ లెక్కన చూసుకుంటే ఓ మున్సిపాలిటీ మొత్తం ఉండే ఓ అపార్టుమెంట్ ను చైనాలో నిర్మించారు. చైనాలో కియాన్ జియాంగ్ సెంచురీ నగరంలో 675 అడుగుల ఎత్తైన అాపార్టుమెంట్ నిర్మించారు. మొత్తం 39 అంతస్తులతో ‘ఎస్’ ఆకారంలో ఈ నిర్మాణం ఉంటుంది. ఈ భవనంలో గరిష్ఠంగా 30 వేల మంది నివసిస్తున్నారు.
ఇది పేరుకు అపార్టుమెంట్ కానీ.. ఓ నగరం అనుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఇందులోనే లభిస్తాయి. నిత్యావసరాల నుంచి మొదలు ఏ అవసరాలకైనా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. షాపింగ్ మాల్స్, రెస్టారంట్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, ఎంటర్టైన్మెంట్, సినిమా హాల్స్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు. ఫిట్నెస్ సెంటర్లు, ఫుడ్ కోర్టులతో వపాటు పార్కులు కృత్రిమంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన, భారీ అపార్ట్ మెంట్ గా ఈ భవనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రీజెంట్ ఇంటర్నేషనల్. ఇలాంటివి రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం ఉంటాయని రియల్ రంగ నిపుణులు అంచనాలు వేస్తున్నారు.