కన్ను..మిన్ను కానరాని నరరూపరాక్షసులకు ఇన్స్టంట్గా శిక్ష పడుతూ ఉంటుంది. అలాంటి ఓ నేరగాడు గురుమూర్తి.. శిక్ష అనుభవించాడు. సజీవంగా దహనమయ్యాడు. అతను చేసిన నేరాన్ని గురించి తెలుసుకుంటే… అతనికి ఎదురైన శిక్ష కరెక్టేనని.. ఎవరికైనా అనిపించడం ఖాయమే. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘోరమైన నేతరం.. ఆపై వెంటనే అమలైన శిక్ష ఒళ్లు గగుర్పొరిడేచేలా ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం అప్పిగానిపల్లిలో గురుమూర్తి అనే వ్యక్తిని కొంత మంది పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారన్న సమాచారం రాగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే గురుమూర్తి పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. పోలీసుల విచారణలో దిమ్మదిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
గురుమూర్తి.. చిల్లర దొంగ. వ్యవనాలకు బానిసయ్యాడు. అందర్నీ వేధిస్తూ ఉండేవాడు. అయితే వీలైనంత వరకూ సహిస్తూ వచ్చిన గ్రామస్తులు… ఈ రోజు చేసిన పనిని చూసి.. సహనం కోల్పోయారు. ఆయన చేసిన పనేమిటంటే.. అరవై ఏళ్లు దాటిన వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడి.. ఆమె వద్ద ఉన్న నాలుగు వేల రూపాయలను అపహరించడం. చావు బతుకుల్లో ఉన్న ఆ వృద్ధురాలి పరిస్థితి చూసి… గ్రామస్తులు చలించిపోయారు. ఆమెను ఆస్పత్రికి తరలించి.. గురుమూర్తి ఎక్కడ ఉన్నారో వెదికారు. వారు ఆగ్రహంలో ఉన్నప్పుడే గురుమూర్తి దొరికాడు. ఇతన్ని అలా వదిలేస్తే… పోలీసులకు అప్పగిస్తే.. రెండు, మూడు రోజుల్లోనే తిరిగి వచ్చి.. గ్రామంలో మరికొందరిపై అరాచకానికి పాల్పడతాడేమోనన్న అంచనాతో.. తామే శిక్ష విధించారు. పెట్రోల్ పోసి సజీవంగా నిప్పంటించారు. దాంతో గురుమూర్తి.. తాను చేసిన నేరానికి ఇన్స్టంట్ శిక్ష అనుభవించినట్లయింది.
సమాజంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. నేరస్వభావం ఉన్నవారు చట్టాల నుంచి సులువుగా తప్పించుకుంటున్నారు. ఈ కారణంగా.. బాధితుల్లో… బాధితులం అవుతామని భయం ఉన్న వారిలో… ఆందోళన పెరిగిపోతోంది. అదే.. తిరగబడటానికి కారణం అవుతోంది. కొద్ది రోజులుగా.. ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. చట్టం.. న్యాయంపై ప్రజలకు నమ్మకం పెరిగితేనే.. ఇలాంటివి ఆగుతాయి..లేకపోతే.. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూనే ఉంటారు.