ధియేటర్ ఓనర్ వర్సెస్ జగన్ సర్కార్ – మళ్లీ కోర్టుకు ?

జూలై ఒకటో తేదీ నుంచి ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతామని ఏ టిక్కెట్ అయినా ప్రభుత్వం అమ్ముతుందని తర్వాత డబ్బులిస్తామని ప్రభుత్వం చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం జీవో ఇచ్చి ఇప్పుడు ధియేటర్ల యజమానులు తమతో ఎంవోయూ చేసుకోవాల్సిందేనని పట్టుబడుతోంది. ఎంవోయూ చేసుకుంటేనే ఆన్ లైన్ పరిధిలోకి వస్తుంది లేకపోతే రాదు. అందుకే.. ఎంవోయూ చేసుకోకపోతే ధియేటర్లను సీజ్ చేస్తామని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారు. అంతే కాదు శాంపిల్‌గా ఒక్కో ఊళ్లో నాలుగైదు సీజ్ చేస్తున్నారు. దీంతో కొంత మంది సంతకాలు పెడుతున్నారు. కానీ చాలా మంది సైలెంట్‌గా ఉంటున్నారు.

ధియేటర్ యజమానులు ఒక్కరిదే నిర్ణయం ఉండదు. వారు కొంత మందితో వ్యాపార ఒప్పందాలు చేసుకుని ఉంటారు. అలాంటి వారు అంగీకరించడం లేదు. ఏం చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు. మరో వైపు ఈ సమస్యను అధిగమించడానికి ఫిల్మ్ చాంబర్ కూడా అధికారికంగా ప్రభుత్వానికి లేక రాసింది. తాము ఆన్ లైన్ టిక్కెట్లు అమ్ముతామని కమిషన్ ఎప్పటికప్పుడు ఇస్తామని చెబుతోంది. కానీ దానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.

కలెక్షన్ డబ్బులు పేటీఎం, బుక్ మై షో లు ఒక్క రోజులో ఇస్తామని ప్రభుత్వం కూడా ఇలా ఒక్క రోజులోనే ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ విషయం ఎంవోయూలో స్పష్టంగా లేదని అంటున్నారు. ఓ సారి ప్రభుత్వం చేతికి డబ్బులు వెళ్తే మళ్లీ వస్తాయో రాదోనన్న ఆందోళనలో ఎగ్జిబిటర్లు,… ఫిల్మ్ ఇండస్ట్రీ వారు ఉన్నారు. అందుకే వీలైనంత వరకూ సంతకాలు చేయకుండా ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారు. ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు ధియేటర్లు మూసుకుంటే మంచిదన్న భావనలో ఉన్నారు. లేనిపోని నిబంధనలు పెడుతున్న ప్రభుత్వం రెండు శాతం కమిషన్ తీసుకోవడమే కాదు… భవిష్యత్‌లో మరిన్ని పన్నులు బాదుతుందని.. అలాగే జరిమానాల పేరుతో వచ్చిన కలెక్షన్ ఉంచేసుకున్నా అడిగే దిక్కు ఉండదన్న ఆందోళనలో ఉన్నారు. పరిస్థితి చూస్తూంటే సగం ధియేటర్లు ఒప్పందాలు చేసుకోవడానికి సిద్ధంగా లేనట్లుగా ఉందన్న వాదన వినిపిస్తోంది. మళ్లీ కోర్టుకెళ్లే ఆలోచన చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close