అనుకున్నదంతా అయ్యింది. కోవిడ్ ప్రభావంతో… చిత్రసీమ అల్లాడుతోంది. షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుదలలు ఆగిపోయాయి. ఇప్పుడు ఏకంగా థియేటర్లే బంద్ అయ్యాయి. కోవిడ్ కారణంగా తెలంగాణలో థియేటర్లు మూసేస్తున్నామని ఎగ్జిబీటర్ల సంఘం ప్రకటించింది. బుధవారం నుంచి థియేటర్లకు తాళాలు వేస్తున్నామని తేల్చేసింది. ఈమేరకు తెలంగాణ థియేటర్ల యాజమాన్య సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది. ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా నిబంధనల్ని కఠినతరం చేసింది. కేవలం 50 మంది సిబ్బందితోనే షూటింగులు జరుపుకోవాలని తీర్మాణించింది. దాంతో బుధవారం నుంచి షూటింగులన్నీ.. ఆగిపోయే పరిస్థితి వచ్చింది.