శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న మరో సినిమా `లవ్ స్టోరీ`. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా ఇది. శేఖర్ శైలి మరీ స్లో కాబట్టి, సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. లాక్ డౌన్ వల్ల మరింత.. లేట్ అయ్యింది. ఇప్పుడు లవ్ స్టోరీ షూటింగ్ మళ్లీ మొదలెట్టారు. అన్ని సినిమాల్లానే `లవ్ స్టోరీ`కీ ఓటీటీ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మంచి రేట్లతో.. లవ్ స్టోరీని ఎగరేసుకుపోవడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అయితే.. దర్శక నిర్మాతలు మాత్రం `మా సినిమా ఎవరికీ అమ్మబోవడం లేదు` అంటూ క్లారిటీ ఇచ్చాయి. తమ సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తామని స్పష్టం చేశాయి.
”ఓటీటీ ఆఫర్లు వచ్చిన మాట నిజం. కానీ.. మా సినిమాని ఓటీటీకి ఇవ్వబోవడం లేదు. ఈ సినిమాని థియేటర్లలోనే చూడాలి” అంటూ నిర్మాత స్పష్టం చేశారు. త్వరలోనే చిత్రబృందం ఓ టీజర్ ని విడుదల చేయడానికి రెడీ అవుతోంది. అతి త్వరలోనే టీజర్ విడుదలకు సంబంధించిన ప్రకటన వస్తుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపాలన్నది శేఖర్ కమ్ముల ప్లాన్.