మాజీ హీరోయిన్.. మాజీ ఎంపి విజయశాంతి ఇంట్లో దొంగలు పడ్డారు. విలువైన ఆభరణాలు దోచుకెళ్లారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటోంది విజయశాంతి. శుక్రవారం అర్థరాత్రి ఆమె ఇంట్లో దొంగతనం జరిగిందని తెలుస్తోంది. ఇంట్లో పనిచేసే వ్యక్తులపైనే అందరికీ అనుమానాలున్నాయి. అయితే ఈ విషయంలో ఇప్పటి వరకూ విజయశాంతి పోలీసులకు పిర్యాదు చేయకపోవడం విశేషం. బహుశా.. ఏమేం వస్తువులు పోయాయో నిశితంగా గమనించి అప్పుడు కంప్లైంట్ ఇస్తుందేమో చూడాలి. ఎమ్మెల్యే కాలనీలో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. బయటి వాళ్లు లోపలకు వెళ్లే ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి ఇంట్లో మనుషులే చేతివాటం చూపించే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే తప్ప నిజానిజాలు బయటకు రావు.