టాలీవుడ్‌ని షేక్ చేసిన కాంబినేషన్ ఎన్టీఆర్ – రామ్ చరణ్! ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు అనగానే… కొబ్బరికాయ కొట్టకముందే అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. అయితే ఇంత వరకూ ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ బయటకు రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కథ కూడా రెడీ కాలేదని తెలుస్తోంది. విజయేంద్ర ప్రసాద్ కథని కథగా రాయరు. ఆయన ముందు క్యారెక్టరైజేషన్లు సృష్టించుకుంటారు. ప్రస్తుతం ఈ మల్టీస్టారర్ కూడా అంత వరకూ వచ్చిందని టాక్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల క్యారెక్టరైజేషన్లు రెండూ సిద్ధమయ్యాయని, ఇప్పుడు వాటి మధ్య అసలు కథ రాయడం మొదలవ్వాలని సమాచారం. వీరిద్దరితో పాటు విలన్ క్యారెక్టర్ కూడా ఉండాలి కదా. అది కూడా పూర్తయ్యిందని తెలుస్తోంది. ఎన్టీఆర్, చరణ్ క్యారెక్టరైజేషన్లు రాజమౌళికి విపరీతంగా నచ్చాయని, ఇప్పుడు టీమ్ మొత్తం కలిసి కథని వండే పనిలో పడిందని సమాచారం. ప్రతినాయకుడి పాత్రకూ.. ఓ పేరున్న కథానాయకుడినే తీసుకోవాలన్న ఆలోచనలో ఉంది. అంటే ఈ సినిమాలో హీరోలు ఇద్దరు కాదు… ముగ్గురు. అయితే ఆ మూడో హీరో ఎవరన్నది రాజమౌళి నిర్ణయంపై ఆధారపడి ఉంది.