ఉపఎన్నికల నోటిఫికేషన్ ఇప్పుడల్లా లేదని కేంద్ర ఎన్నికల సంఘం డైరక్ట్ సమాచారాన్ని రాజకీయ పార్టీలకు పంపింది. ఉపఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలపై రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలు చెప్పాలని ఎన్నికల సంఘం లేఖలు రాసింది. ఈ లేఖలు అందుకున్న రాజకీయ పార్టీలు ఖంగుతున్నాయి. ముఖ్యంగా ఉపఎన్నికల బరిలో ఉన్న పార్టీలు షాక్ తిన్నాయి. ఎందుకంటే నేడో రేపో ఉపఎన్నికల షెడ్యూల్ వస్తుందని రంగంలోకి దిగి.. అభ్యర్థులను ఖరారు చేసుకుని ప్రచారబరిలో రోజూ భారీ ఎత్తున ఖర్చుపెట్టుకుంటూంటే.. ఇప్పుడు ఎన్నికలపై అభిప్రాయం చెప్పమనడం ఏమిటనేదే ఆ రాజకీయ పార్టీలకు అర్థం కాని విషయం.
పైగా అభిప్రాయాలు చెప్పడానికి ఈసీ ఇచ్చినగడువు కూడా ఆగస్టు నెలాఖరు వరకు ఉన్నది. అంటే.. ఆ గడువు వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోరన్నమాట. పూర్తి స్థాయిలో అభిప్రాయాలు సేకరించి… నిర్ణయం తీసుకునే సరికి సెప్టెంబర్ సగం అవుతుంది. ఆ తర్వాత మాత్రమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అంటే.. ఎలాలేదన్న నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే మరో నెల తర్వాతే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఇప్పుడల్లా ఎన్నికలు వద్దన్న సందేశాన్ని పరోక్షంగాపంపించారు.
ఎమెల్సీ ఎన్నికలు నిర్వహించవద్దని .. ఇది మంచి సమయం కాదని ఈసీకి వివరించారు. తర్వాత కూడా ఇదే అభిప్రాయంతో ఉంటే… ఉపఎన్నికలపై ఈసీ వెనుకడుగు వేసే అవకాశం ఉంది. ఎలాగూ ఐదురాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాల్సిందేకాబట్టి… వాటితో పాటు ఉపఎన్నికలు పెట్టే ఆలోచన ఎన్నికల సంఘం చేసే అవకాశం ఉంది.ఈ లెక్కలను బేరీజు వేసుకుంటే.. హుజూరాబాద్‌లో రాజకీయా పార్టీలకు ఆయాసం తప్ప ఇప్పుడల్లా పోరాటం ఉండే అవకాశం లేదన్నమాట.