కరోనాను రాజకీయంగా వాడుకోవడానికి చూపించేంతటి తెలివితేటలు.. నిజంగా ఏర్పాట్లలో చూపించకపోవడంతో ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… పదకొండో తేదీ నుంచి పధ్నాలుగో తేదీ నుంచి టీకా ఉత్సవ్ నిర్వహించాలని నిర్ణయించారు. ముందుగా టీకాలు ఉన్నాయో లేదో… చూసుకుని అన్ని రాష్ట్రాలకు కావాల్సినన్ని పింపించి.. ఆ తర్వాత ఎవరైనా ప్రకటన చేస్తారు. కానీ ప్రధానమంత్రి మోడీ మాత్రం అలాంటివేమీ పట్టించుకోకుండాప్రకటన చేసేసినట్లుగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రాల నుంచి టీకాలు పంపాలని ఆయనకు రివర్స్‌లో లెటర్లు వెళ్తున్నాయి.
కోటి మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి … మొహమాటం లేకుండా కేంద్రానికిలేఖ రాశారు. అర్జంట్‌గా పాతిక లక్షల డోస్‌ల టీకాలు పంపాలని కోరారు. టీకా ఉత్సవ్ నిర్వహించడానికి సరిపడా టీకా స్టాక్ లేదని ఆయన స్పష్టంచేసింది. ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు… మహారాష్ట్ర సీఎం.. రాజస్థాన్ సీఎం… ఇలా దాదాపుగా ప్రతీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి లేఖలు వెళ్తున్నాయి. టీకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు… ప్రతిపక్షల నుంచి మోడీకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇండియా జనానికే టీకాలు లేకపోతే.. మైత్రి పేరుతో విదేశాలకు ఎందుకు ఎగుమతి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనికి కేంద్రం వద్ద సమాధానం లేదు.
నిజానికి దేశంలో రెండే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి కోవిషీల్డ్ కాగా..మరొకటి కోవాగ్జిన్. ఈ రెండింటి ఉత్పత్తి చాలా పరిమితం. వీటి నుంచే.. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాష్ట్రాలకు పంపుతున్నారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సమయంలో వ్యాక్సినేషన్ మాత్రమే.. ప్రజల్ని కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో… టీకాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించకుండా… టీకా ఫెస్టివల్‌ను మోడీ ప్రకిటంచారు. పండగ పూట పస్తులు పెట్టినట్లుగా.. టీకా ఉత్సవ్ సందర్భంగా.. వేడుకలు..సభలు నిర్వహించుకోవడం తప్ప.. టీకాలు వేసే పరిస్థితి కనిపించడం లేదు. చిత్తశుద్ధి లేని పాలకులు..పబ్లిసిటీ కోసం పని చేస్తే ప్రజలకు ఇలాంటి కష్టాలే ఎదురవుతాయని ప్రత్యేకంగా నిరూపించాల్సిన పని లేదు.