ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత.. జైలు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కల్పించాల్సిన సౌకర్యాలను కల్పించకుండా రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటి నుంచి భోజనం , పెన్ను, పుస్తకాలకు సైతం అనుమతి ఉన్నా జైలు సూపరిండెంట్ మాత్రం వాటిని నిరాకరిస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
తీహార్ జైలు అధికారులపై కవిత అసంతృప్తి వ్యక్తం చేసిన తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. తీహార్ అంటే తెలంగాణ కాదు.. నువ్వు చెప్పినట్లు నడుచుకోవడానికి అంటూ ట్రోల్ చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ చేసి తీహార్ జైలులో ఎంచక్క సౌకర్యాలతో కాలాన్ని గడుపుదామని అనుకున్నావా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అద్దాల మేడలు , ఏసీ కార్లు , పిలిస్తే ఉరికొచ్చే పని మనుషులు.. ఇవన్నీ లేకపోయే సరికి కవిత కాస్త ఇబ్బంది పడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి తీహార్ జైలు నిబంధనలు కాస్త కఠినంగానే ఉంటాయి. ఇప్పుడు ఆ అనుభవం కవితకు కూడా ఎదురు అవుతుంది. తీహార్ జైల్లో కవితకు స్పెషల్ కోర్టు ప్రత్యేక వెసులుబాట్లు ఇచ్చినా అధికారులు వాటిని ఉల్లంఘిస్తున్న తీరుపై బయట నుంచి మాత్రం కవితకు సానుభూతి లభించడం లేదు.