ఈవారం రెండు సినిమాలొచ్చాయి. శుక్రవారం విడుదలైన బాబు బంగారం… ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది. ఈరోజు (శనివారం) విడుదలైన తిక్క అయితే మరీ ఘోరం. ఈసినిమా డిజాస్టర్ల జాబితాలో చేరిపోయింది. 2016లో ఇంత ఘోరమైన సినిమా రాలేదని విశ్లేషకులు అప్పుడే తేల్చేస్తున్నారు. ఈ రిజల్ట్ సాయిధరమ్ తేజ్‌కు మింగుడు పడడం లేదు. అయితే మరో మెగా హీరో రామ్ చరణ్ మాత్రం తిక్క ఫ్లాప్ అవ్వడంతో ఊపిరి పీల్చుకొన్నాడు. కారణం ఏమిటంటే… తిక్క దర్శకుడు సునీల్‌రెడ్డి చరణ్‌కి మంచి దోస్త్. కల్యాణ్ రామ్ సినిమా ఓంకి దర్శకత్వం వహించాడు సునీల్‌రెడ్డి. అప్పుడు చరణ్‌కీ ఓ కథ చెప్పి ఓకే చేయించుకొందామని తెగ తాపత్రయపడ్డాడు. ఓ కథ కూడా చరణ్‌కి వినిపించడం జరిగింది. అయితే చరణ్ మాత్రం ‘ఓం’ విడుదలయ్యాక చూద్దాంలే అని దాటేశాడు.
ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సునీల్ రెడ్డి కూడా చరణ్‌ని ఛాన్స్ అడిగే సాహసం చేయలేకపోయాడు. ఒకవేళ ఓం సినిమా యావరేజ్‌గా ఆడినా, మిత్రుడి కోసం చరణ్ సినిమా అవకాశం ఇచ్చేవాడే. అలా ఇచ్చుంటే.. ఈ పాటికి తిక్క సినిమాలో రామ్ చరణ్ కనిపించేవాడు. ఒకవేళ తిక్క కథ కాకపోయినా.. చరణ్‌కి తగిన మరో కథతో అయినా సునీల్ రెడ్డి సినిమా తీసేవాడు. ఆ సినిమా కూడా తిక్కలానే తయారయ్యేది. సో.. సునీల్ రెడ్డికి అవకాశం ఇవ్వనందుకు ఇప్పుడు చరణ్ హ్యాపీగా ఫీలౌతుంటాడు.