భూమి, బంగారం పై పెట్టుబడి ఎప్పటికీ లాభమే. భూమి ఇప్పుడు చిన్నచిన్న ప్లాట్లుగా .. ఇంటి స్థలాలుగా కొనుగోలు చేసి పెట్టుబడిగా అట్టి పెట్టుకుంటున్నారు. అయితే ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను పరిశీలించాలి. ముందుగా టైటిల్ డీడ్ క్షణ్నంగా తనిఖీ చేయడం చాలా ముఖ్యం. టైటిల్ డీడ్‌ను తనిఖీ వల్ల ఆ భూమి ఎవరిదో తెలుస్తుంది. భూమి యజమానికి మాత్రమే ఆ భూమిని అమ్మే హక్కు ఉంది. స్థలం అమ్మే వ్యక్తి పేరు మీద ఆ భూమి రిజిస్టర్ అయిందో, లేదో చూడటానికి మ్యుటేషన్ రికార్డులను కూడా తనిఖి చేయాలి.
కొనబోయే భూమి రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీయించుకోవాలి. ల్యాండ్ ఒరిజినల్ ఓనర్ కాకుండా వేరే ఎవరైనా మోసపూరితంగా మీకు ఆ భూమిని అమ్ముతున్నా, అది ప్రభుత్వ భూమి/అసైన్డ్ ల్యాండ్ అయినా, డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినా, ఆ భూమిని తనఖా పెట్టి రుణం తీసుకున్నా… టైటిల్ డీడ్‌ను చెక్ చేయిచడం వల్ల తెలుస్తుంది. అసలు ఆ భూమి రిజిస్టర్ అయిందో, లేదో కూడా తెలుస్తుంది. EC వల్ల ఆ ప్లాట్‌లో ఏవైనా లోపాలు లేదా మోసాలు ఉంటే తెలుస్తాయి.
ECని, రిజిస్ట్రేషన్ పేపర్లను, లింక్ డాక్యుమెంట్లను రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర ఉండే బ్రోకర్‌కు చూపించి చెక్ చేయించుకోవాలి. లాయర్ అభిప్రాయం కూడా తీసుకోవాలి. రియల్ ఎస్టేట్ కంపెనీ వేసే వెంచర్లో ప్లాట్ కొంటుంటే, వెంచర్ బుక్ అని ఉంటుంది దానిని కచ్చితంగా తీసుకోవాలి. ఆ వెంచర్ ప్లానింగ్ సహా అవసరమైన అనుమతి పత్రాల నకళ్లు వెంచర్ బుక్‌లో ఉంటాయి.