మహానగరాల్లోనే కాదు ఇప్పుడు నగర పంచాయతీల్లోనూ అపార్టుమెంట్ల సంస్కృతి పెరుగుతోంది. అయితే కొనుగోలుదారులు ఎన్నో సార్లు మోసానికి గురవుతూ ఉంటారు. నిర్మాణ లోపాల సంగతి పక్కన పెడితే అసలు భవిష్యత్‌లో ఎన్నో సమస్యలకు కారణమయ్యేతప్పులు బిల్డర్లు చేస్తూంటారు. వాటిలో ప్రధానమైది ప్లాన్ ప్రకారం కట్టకపోవడం..లే ఔట్లో మార్పులు చేయడం. నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని దాని ప్రకారం నిర్మించడం చాలా ముఖ్యం. లేకపోతే కొనుగోలు చేసిన తర్వాత ఇబ్బంది పడేదే కొనుగోలుదారులే.
అందుకే అపార్టుమెంట్ ను నిర్మిస్తున్నప్పుడు కొనుగోలు చేస్తే ఒరిజినల్ డిజైన్, స్ట్రక్చర్ లేదా లేఅవుట్లో మార్పులు ఏమైనా ఉంటే వెంటనే గుర్తించాలి. వాటికి సంబంధించి ఒప్పంద పత్రాల్లో ఏమైనా ఉంటే పరిశీలించారు. మీ సమ్మతి లేకుండా బిల్డర్ గణనీయమైన మార్పులు చేస్తూంటే ఖచ్చితంగా అభ్యంతరం చెప్పాలి. ఒక వేళ నిర్మాణం పూర్తయిన తర్వాత కొనుగోలుచేస్తూంటే.. అనుమతులకు తగ్గట్లుగా నిర్మించినట్లుగా పరిశీలన చేసుకోవాలి. తేడాలు ఉంటే బిల్డర్‌ను ప్రశ్నించాల్సిందే.
ప్లాన్‌కు తగ్గట్లుగా నిర్మాణం లేకపోతే దానికి రివైజ్డ్ అనుమతిని బిల్డప్ పొందాలని గట్టిగా డిమాండ్ చేయవచ్చు. కొంత మంది నాలుగు అంతస్తులకు పర్మిషన్ తీసుకుని ఐదు అంతస్తులను నిర్మిస్తారు. పైన పెంట్ హౌస్ కూడా నిర్మిస్తారు. ఇలాంటి వాటి విషయంలో .. బ్రోకర్లతో కానీ..బిల్డర్ తో కానీ స్పష్టంగా మాట్లాడి క్లారిటీ తీసుకున్న తర్వాత ముందడుగువేయాలి. ఓ సారి బిల్డర్ ప్లాట్ అమ్మిన తర్వాత ఎలాంటి బాధ్యత తీసుకునేందుకు ఇష్టపడడు.