‘డాకు మహారాజ్’ నుంచి బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకునే పాట బయటికి వచ్చింది. దబిడి దిబిడి అంటూ సాగిన ఈ పాటని స్వరకర్త తమన్, గీత రచయిత కాసర్ల శ్యామ్ బాలయ్య ఫ్యాన్స్ కోరుకునే పాటగా రెడీ చేశారు. ట్యూన్, బీట్ చాలా క్యాచిగా డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేశాడు తమన్.
ముఖ్యంగా పాటలో లిరిక్స్ ని మాస్ ఆడియన్స్ కి పట్టేలా రాశాడు కాసర్ల శ్యామ్. లిరిక్స్ అన్ని కూడా బాలయ్య సినిమాల్లోని రిఫరెన్స్ లే. దబిడి దిబిడి, సింహం, ఫ్లూటు, రెండో వైపు చూడకు, అడుగు పెడితే హిస్టరీ రిపీట్, కత్తి, కంటి చూపులు, ప్లేసు టైం.. ఇలా బాలయ్య సిగ్నేచర్ పదాలన్ని అల్లుకొని పాటని రాయడం గమ్మత్తుగా వుంది.
పాటలో బాలయ్య స్టెప్పులు ప్రత్యేకంగా నిలిచాయి. థియేటర్స్ లో విజల్స్ పడే మాస్ మూమెంట్స్ వున్నాయి. ఊర్వశీ రౌతేలా గ్లామరస్ డ్యాన్సులు పాటకు మరో స్పెషల్ అట్రాక్షన్. బాలయ్య సినిమా అంటే హుషారైన పాటలు తప్పనిసరి. డాకు మహారాజ్ అలాంటి సందడి దబిడి దిబిడి సాంగ్ తీసుకొచ్చిందనే చెప్పాలి. జనవరి 12న సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.