మాస్ మహారాజా రవితేజ, శరత్ మండవ కలయికలో వస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇప్పటికే ఎ చిత్రం నుండి రెండు పాటలు వచ్చాయి. అయితే పెద్దగా ఆకట్టుకోలేదు, సిద్ శ్రీరామ్ పాడిన బుల్ బుల్ తరంగ్ పాట కూడా పెద్దగా కిక్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కాస్త జోష్ నింపే పాట ఒకటి బయటికి వచ్చింది ‘నాపేరు సీసా’ అనే పాటని విడుదల చేశారు. అన్వేషి జైన్ సీసా (సీకాకులం సారంగీ)గా కనిపించింది. గ్లామర్ డోస్ కూడా బాగానే దట్టించారు. మాస్ సాంగ్ ఇది. సామ్ సిఎస్ మాస్ ఈ పాటని డ్యాన్సింగ్ నెంబర్ గా కంపోజ్ చేయగా ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం ఆకట్టుకుంది.
♫నా పేరు సీసా
ఒకరికినే తేనె సీసా
ఒకరికినే కల్లు సీసా
ఒకరికినే మసాలా సీసా
ఇంకొకరికి రసాల సీసా
అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా♫
పాట పల్లవిలో వినిపించిన ఈ లిరిక్స్ క్యాచిగా ఆకట్టుకున్నాయి. శ్రేయా ఘోషల్, సామ్ సిఎస్ ఫుల్ ఎనర్జీటిక్ గా ఈ పాటని ఆలపించారు. మొత్తానికి ఈ పాట ‘రామారావు ఆన్ డ్యూటీ’ కాస్త జోష్ ని తెచ్చింది.