దేశంలో మూడో దశ వ్యాక్సినేషన్ పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ వేయాలని… కేంద్రం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లు కూడా చేసుకుంది. కానీ ముహుర్తం గడువు అయిన మే ఒకటో తేదీన.. ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ పబ్లిసిటీ స్టంట్‌గా తేలిపోయింది. దేశంలో ఆరు అంటే ఆరు రాష్ట్రాలు.. అదీ కూడా… చాలా పరిమితంగా.. వ్యాక్సిన్ వేశారు. అదీ కూడా.. ప్రారంభించామని చెప్పుకోవడానికన్నట్లుగా ఆ డ్రైవ్ సాగింది. దేశంలో అత్యంత ప్రధాన రాష్ట్రాలన్నీ.. తమ వద్ద వ్యాక్సినేషన్ డోస్‌లు లేవని.. తాము ప్రారంభించడం లేదని ముందుగానే ప్రకటించాయి. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రం 45 ఏళ్ల పైబడిన వారికి పూర్తి స్థాయిలో రెండు డోసుల వ్యాక్సిన్లు ఇవ్వకముందే.. పద్దెనిమిదేళ్లు నిండిన కొంతమందికి వ్యాక్సిన్లు వేస్తున్నాయి.
నిజానికి కేంద్రం.. మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించడమే కాకుండా… రాష్ట్రాలకు .. కోటి ఇరవై లక్షలకుపైగా టీకా డోసులను పంపిణీ చేసింది. వాటిని మూడో దశ కోసం వాడమని సూచించింది. కానీ చాలా రాష్ట్రాల్లో ఇంకా.. నలభై ఐదేళ్లు నిండిన వారికి… సగం మందికి కూడా వేయలేదు. దాంతో ఆయా రాష్ట్రాలు.. తాము ముందుగా.. నలభై ఐదేళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించాయి. ఆ డోసులు వాటికే వాడతామని.. స్పష్టం చేశాయి. దీంతో కేంద్రం కూడా ఏమీచేయలేని పరిస్థితిలో పడింది. నిజానికి.. కొన్ని రాష్ట్రాలు.. కంపెనీల వద్ద నుంచి నేరుగా టీకాలు కొని పంపిణీ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. కానీ రేటు ఎక్కువ కావడంతో ముందడుగు వేయలేకపోతున్నాయి.
కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం… పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. డబ్బులు ఉన్న వాళ్లకి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో… కంపెనీలు ప్రకటించిన ధరకు అదనంగా పన్నులు.. ఇతర చార్జీలు కలుపుకుని వ్యాక్సిన్లు వేస్తున్నారు. అపోలో ఆస్పత్రిలో వ్యాక్సిన్ల ప్రక్రియ నడుస్తోంది. అంటే డబ్బులున్న వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. లేని వారు మాత్రం.. ప్రభుత్వం ఇచ్చే వరకూ… ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ పై అన్ని వర్గాల నుంచి ఎన్ని విమర్శలు వస్తున్నా.. కేంద్రం మాత్రం వెనుకడుగు వేయడం లేదు.