అమెరికాలో ‘గన్ కల్చర్’ కి అభం శుభం తెలియని చిన్నారులు, విద్యార్ధులే ఎక్కువగా బలవుతుంటారు. చిరిస్ హార్పర్ మెర్సెర్ అనే 26 ఏళ్ల వయసున్న యువకుడు ఒరెగాన్ లో గల వుంపక్ కమ్యూనిటీ కాలేజీ విద్యార్ధులపై విచక్షణా రహితంగా కాలుపులు జరపడంతో 10 మంది అక్కడికక్కడే మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురు విద్యార్ధులు ఆసుపత్రిలో చికిత్స పొందుతో మరణించారు. గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరు విద్యార్ధుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన అమెరికా కాలమాన ప్రకారం గురువారం ఉదయం 10.30 గంటలకు జరిగింది. కాల్పుల విషయం తెలుసుకొని తక్షణమే పోలీసులు అక్కడికి చేరుకొనన్నప్పుడు అతను పోలీసులపై కూడా కాల్పులు జరిపాడు. కానీ చివరికి పోలీసులు ఆ యువకుడిని నిర్బంధించగలిగారు. అతని వద్ద నుండి పోలీసులు నాలుగు తుపాకులు స్వాధీనం చేసుకొన్నారు.
పోలీసులు అతను నివాసం ఉండే వించిస్టర్ ఒరెగాన్ లో ఇంటిని శోదాలు చేసి కొన్న వస్తువులను స్వాధీనం చేసుకొన్నారు.అతనితో బాటు ఆ ఇంట్లో అతని తల్లి కూడా ఉంటుందని ఆ అపార్ట్ మెంటులో నివసించేవారు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ సంఘటనపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసి ఇకనయినా దేశంలో ‘గన్ కల్చర్’ ని రూపుమాపేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అమెరికాలో ఉగ్రవాదం వలన 2015 సం.లో ఒక్కరు కూడా మృతి చెందలేదు కానీ ఈ గన్ కల్చర్ కి ఇంతవరకు 8,512 మంది అమాయకులు బలైపోయారని గణాంకాలు తెలియజేస్తున్నాయి.