అఖిల్ తొలి సినిమా అఖిల్‌తో పోలిస్తే.. హలో వంద రెట్లు బెస్ట్. అటు అఖిల్ నటన పరంగా, క్వాలిటీ పరంగా, మేకింగ్ పరంగా…. హలో ముందే ఉంది. ఎంసీఏతో పోలిస్తే… హలోకే రేటింగులు బాగా వచ్చాయి. కానీ విచత్రం ఏమిటంటే… హలో కూడా నష్టపోక తప్పదు. ఈ చిత్రానికి దాదాపు 40 కోట్లకు పైగానే ఖర్చు పెట్టాడు నాగార్జున. ఇదంతా కొడుకుపై నమ్మకం అనుకొంటే పొరపాటే. విక్రమ్ కె.కుమార్‌పై భరోసా. తనుఅడిగిన టెక్నీషియన్లను రంగంలోకి దింపాడు. రీషూట్లు జరిగాయి. మేకింగ్ పరంగా ఎక్కడా రాజీ పడలేదు. దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కీ బాగా ఎక్కువ ఖర్చు పెట్టేశారు. అఖిల్ సినిమాకి అంత మార్కెట్ లేదంటూ.. సన్నిహితులు వారించినా నాగ్ వెనకడుగు వేయలేదు. ఇదే విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావిస్తే.. ”నా కొడుకు సినిమా…. అందుకే ఖర్చు పెట్టాను” అని సంతోషంగా చెప్పాడు. అయితే ఆ మితిమీరిన బడ్జెట్టే ‘హలో’ పాలిట శాపంగా మారింది. దాదాపుగా రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకూ `హలో` నష్టపోయే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. కాకపోతే ఒకటి.. అఖిల్‌కి నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. దానికి తోడు ‘హలో’ తో అకిల్లో కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా పెరిగాయి. తదుపరి సినిమాల బడ్జెట్ విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది.