‘తొలిప్రేమ’ అనగానే ఇదో రొమాంటిక్ సినిమా అని అర్థమైపోతోంది. దాన్ని ప్రతీ ఫ్రేమ్‌లోనూ ప్రతిబింబించేలా.. ట్రైలర్ కట్ చేశారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వెంకీ అట్లూరి దర్శకుడు. రాశీఖన్నా కథానాయిక. ఈనెల 10న విడుదల అవుతోంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రమిది. లవ్, ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో సాగే కథ. ‘జ్ఞాపకాల’ చుట్టూ నడిచే ఇద్దరు ప్రేమికుల జీవితం. దాన్ని ట్రైలర్లో కనిపించేలా చేశారు. విజువల్స్ , ఆర్.ఆర్… ఎమోషన్స్ ఇవన్నీ చూస్తుంటే మరో మంచి ప్రేమ కథా చిత్రమ్ చూడబోతున్నామన్న సంగతి అర్థమవుతూనే ఉంది. వరుణ్ రెండు గెటప్పుల్లో కనిపిస్తున్నాడు. రాశీఖన్నా కళ్లజోడు పెట్టుకున్న లుక్స్ కొత్తగా ఉన్నాయి. చూస్తుంటే ఇద్దరి పాత్రలూ పోటా పోటీగా సాగబోతున్నట్టు తెలుస్తోంది. తమన్ మ్యూజిక్, ఇచ్చిన ఆర్.ఆర్… కథని ఎలివేట్ చేసేలా కనిపిస్తున్నాయి. ట్రైలర్ చూడగానే ఓ ఫ్రెష్ ఫీలింగ్.. కలుగుతోంది. చివర్లో హారన్ సౌండ్‌కి ఉలిక్కి పడడం.. ముద్దు మిస్ అవ్వడం.. ఫన్నీగా ఉన్నా – అలాంటి క్యూట్ ఎమోషన్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. మొత్తానికి
ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. గెట్ రెడీ ఫర్ ద ట్రీట్