రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఓ సినిమాలో హీరోయిన్ గా చేసిన సుమయా రెడ్డి అనే నటి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో గగ్గోలు రేగింది. తోపుదుర్తి, సుమయారెడ్డి ఓ ఎయిర్ పోర్టులో మరీ క్లోజ్ గా ఉన్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి కేరళ ట్రిప్ కు వెళ్లారని కొంత మంది సాక్ష్యాలు ఆన్ లైన్ లో పెట్టారు. ఈ అంశం సహజంగానే కలకలం రేపింది.
అయితే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం ఆ సుమయా రెడ్డి తమ బంధువు అని.. తమ కుటుంబంతో ఆమె సన్నిహితంగా ఉంటుందని ప్రకటించారు. ఎయిర్ పోర్టులో కలిసి మాట్లాడినంత మాత్రాన తప్పుడు ప్రచారం చేసి క్యారెక్టర్ ను దిగజార్చలేరని మండిపడ్డారు. సుమయారెడ్డి కూడా ఓ వీడియో విడుదల చేశారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం ఉందని, వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అంతకు మించి వేరే ఏం లేదని ..తప్పుడు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన సుమయారెడ్డి.. డియర్ ఉమ అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. నిర్మాత కూడా ఆమె అని భావిస్తున్నారు. ఆ తర్వాత మరో సినిమా చాన్స్ ఆమెకు రాలేదు. అయితే ఇప్పుడు తోపుదుర్తితో ఎయిర్ పోర్టులో సన్నిహితంగా కనిపించడం ద్వారా వైరల్ అయ్యారు.