ఏపీ సీఐడీకి ఆస్తులు అటాచ్ చేసే అధికారం లేదు. కానీ ఆస్తుల అటాచ్ అంటూ కూలీ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రచారం మాత్రం జోరుగా చేస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోపై విస్తృత ప్రచారం జరుగుతున్న సమయంలో డైవర్షన్ కోసమంటూ సీఐడీ .. మార్గదర్శి ఆస్తులను అటాచ్ చేసిందని కొత్త ప్రచారం ప్రారంభించారు. మూడు వారాల కిందట.. చంద్రబాబు కరకట్ట హౌస్ ను జప్తు చేశామని హాడావుడి చేశారు. నారాయణ ఆస్తులను జప్తు చేశామన్నారు. కానీ వారు విడుదల చేసిన ఉత్తర్వులు దేనికీ పనికి రావు. ఆ విషయం వారికీ తెలుసు. అందుకే కోర్టు దాకా వెళ్లలేదు.
కోర్టుకెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు మార్గదర్శిపై తప్పుడు ప్రచారం ప్రారంభించారు. ఇలా ఇష్టారీతిన ప్రైవేటు ఆస్తులను అటాచ్ చేయండ సీఐడీకి సాధ్యం కాదు. ప్రభుత్వం ఉదహరిస్తున్న బ్రిటిష్ కాలం నాటి చట్టం ప్రకారమే అయినా కోర్టు అనుమతితోనే జప్తు చేయాలి. కానీ ఇప్పుడు ..కేవలం సీఐడీకి ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఆ అనుమతిని పట్టుకుని సీఐడీ కోర్టుకెళ్లి.. తప్పు చేశారని..ఆ ఆస్తులు స్కామ్ ద్వారానే సమీకరించుకున్నారని.. నిర్ధారించుకుంటే అప్పుడు జప్తుకు ఆదేశాలిస్తుంది. అంటే ఆ ఆస్తులపై లావాదేవీలు చేయకూడదు..అంతే.
అసలు మార్గదర్శి విషయంలో తప్పేం జరిగిందో ఇంత వరకూ సీఐడీ చెప్పనే లేదు. ఒక్క బాధితుడు కూడా లేడు. చిట్స్ ద్వారా వచ్చిన లాభాలను మార్గదర్శి ఎలా వాడుకుంటే.. సీఐడీకి ఎందుకో చెప్పడం లేదు. రోజులతరబడి సోదాలు చేశారు కానీ.. కోర్టులో ఫలానా తప్పు జరిగిందని మాత్రం చెప్పడం లేదు. కానీ మీడియాలో మాత్రం చేస్తున్న ప్రచారం ఓ రేంజ్ లో ఉంది. ఈ విషయంలో నెంబర్ , టు చానళ్లు తమ స్వామిభక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. రియల్ గా సీబీఐ చార్జిషీ టులో జగన్ పేరు ఉంటే చెప్పడానికి ఈ చానళ్లకు నోరు రాదు కానీ.. పనికి రాని ఉత్తర్వులతో తప్పుడు ప్రచారాలు చేయడానికి మాత్రం ముందు ఉంటారు.