బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని చంపుతామని ఆ రాష్ట్రంలోకి ‘కషిష్’ అనే ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ కి గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఒక ఎస్.ఎం.ఎస్.మెసేజ్ అందింది. ఆ విషయం పోలీసులకు తెలియజేయగానే, పోలీసులు ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పాట్నాలోని శ్రీకృష్ణ పూరి పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 387క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టీవీ ఛానల్ యాజమాన్యం చెప్పిన ప్రకారం ఆ మెసేజ్ బిహార్ లో నుంచి కాక వేరే రాష్ట్రం నుండి వచ్చినట్లు తాము గుర్తించమని తెలిపారు. మొబైల్ ఫోన్ నుండి వచ్చిన మెసేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. కనుక నిజంగా అటువంటి ఉద్దేశ్యం ఉన్న వ్యక్తులు ఎవరూ అటువంటి పొరపాటు చేయరు. కనుక ఎవరో ఆకతాయితనంతోనే ఈవిధంగా బెదిరించి ఉండవచ్చును. ఇది ఎవరయినా ఆకతాయితనంతో చేసినపనా లేక నిజంగానే బెదిరిస్తున్నారా? ఎవరు బెదిరించారు? కారణాలు ఏమిటి? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాలి.