ఇటీవలే మోహన్ బాబు వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ మోహన్ బాబుకి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయట. ఈ విషయమై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ మేరకు బంజారా హీల్స్ పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు.గత నెల 26 నుంచి తనకు ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మోహన్ బాబుకి ఈ ఫోన్ కాల్స్ విదేశాల నుంచి వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వైకాపాలో మోహన్ బాబు చేరకముందే.. తెలుగుదేశానికి, చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత వైకాపాలో చేరారు. నిన్ననే చెక్ బౌన్స్ కేసులో మోహన్ బాబు కి కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.