పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. అదే.. `భవదీయుడు… భగత్ సింగ్`. ఈ సినిమా స్క్రిప్టు ఎప్పుడో లాక్ అయిపోయింది. సెట్స్‌పైకి వెళ్లడమే బాకీ. ఈలోగా నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపికపై కసరత్తు సాగుతోంది. ఈ సినిమాలో గ్లామర్‌కు ఏమాత్రం కొదవ లేకుండా హరీష్ శంకర్ జాగ్రత్త పడుతున్నాడట. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్. ఓ కథానాయికగా పూజా హెగ్డే దాదాపుగా ఫిక్స్. మరో ఇద్దరు హీరోయిన్లు కావాలి. వాళ్ల కోసం ఇప్పుడు అన్వేషణ జరుగుతోంది. ఓ హీరోయిన్ పాత్ర.. చాలా గ్లామరెస్‌గా ఉండాలట. ఆ హీరోయిన్‌తో ఐటెమ్ సాంగ్ కూడా చేయిస్తారని సమాచారం. `గబ్బర్‌సింగ్`లో కెవ్వు కేక సూపర్ హిట్ అయ్యింది. పవన్ సినిమాల్లోనే ది బెస్ట్ ఐటెమ్ గీతమది. అలాంటి పాట ఈసినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడట. ఆ పాటలో ఓ హీరోయిన్ కనిపించాల్సిందే. ఇందులో పవన్ ఓ లెక్చలర్‌గా నటించబోతున్నాడు. కాలేజీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని చాలా ఫ్రెష్‌గా ఉండేలా రాసుకున్నాడట హరీష్. తన బలం.. రైటింగే. కామెడీ ఎపిసోడ్స్, ట్రాకులతో… సినిమాని హాయిగా నడిపించేస్తాడు. అలాంటి ఎపిసోడ్లు కాలేజీ సీన్స్‌లో బాగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది.