అమరావతి రైతుల పాదయాత్ర అద్భుత స్పందనతో సాగుతూండటంతో వైసీపీ నేతలు మూాడురాజధానులపై చర్చ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మేధావులతో భేటీలంటూ ఏర్పాటు చేసి టీడీపీ నేతలుచెప్పే కూలి మీడియాలు లైవ్‌లు ఇస్తున్నా అంతా టీ , కాఫీల మీటింగ్‌లుగానే ఉండిపోతున్నాయి. వైసీపీ నేతలూ మూడు రాజధానుల్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. హైకమాండ్ చెప్పినప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. లేకపోతే లేదు. కానీ అమరావతి రైతులు మాత్రం అందరి మద్దతుతో ముందుకెళ్తున్నారు.
అమరావతి రైతులకు ఈ స్థాయి మద్దతు వస్తుందని వైసీపీ నేతలు కూడా ఊహించలేకపోయారు. రైతులకు టీడీపీతో పాటు జనసేన సహా అన్ని పార్టీలు… ప్రజాసంఘాలు మద్దతు పలికాయి. ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకిస్తోంది. వైసీపీ కూడా ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికి… ఇప్పుడు మడమ తిప్పిందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అందుకే వైసీపీ తీరుపై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మాట మార్చి రైతుల్ని మోసం చేశారన్న అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారు.
అమరావతి రైతులపై దాడులు చేస్తామంటూ వైసీపీ నేతలు హెచ్చరికలు చేయడం కూడా .. వారి నైజంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేస్తోంది. ప్రాంతీయ సెంటిమెంట్‌ను ఎంత రెచ్చగొట్టాలని చూసినా ప్రజలు.. ఆంధ్రా అనే సెంటిమెంట్‌కే స్టిక్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో ఉత్తరాంధ్ర వేరు.. రాయలసీమ వేరు అనే భావనకు రావడం లేదు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఏకగ్రీవంగా అందరూ ఆమోదించారు. అప్పుడెవరూ తమకు రాజధాని కావాలని అడగలేదు. వైసీపీ మూడు రాజధానులు అన్నప్పుడు కూడా అడగలేదు. కేవలం వైసీపీ రాజకీయ లబ్దికే ఈ విధానం తెచ్చారు. అందుకే ఈ పరిణామాల్ని కూడా వైసీపీ ఎదుర్కోక తప్పడం లేదు.