తెలుగువాడి ఖ్యాతిని మరోసారి విశ్వవ్యాప్తం చేసిన సినిమా బాహుబలి. ఆ చిత్రానికి భారీ వసూళ్లే కాదు, జాతీయ అవార్డులూ దక్కాయి. ఇప్పుడు బాహుబలి 2 వంతు వచ్చింది. 2018 జాతీయ అవార్డుల్లో బాహుబలి 2కి మూడు పురస్కారాలు దక్కాయి. ఉత్తమ యాక్షన్ చిత్రంగా, బెస్ట్ పాపులర్ ఫిల్మ్‌గా బాహుబలి అవార్డులు అందుకోబోతోంది. స్పెషల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీలోనూ బాహుబలికి జాతీయ పురస్కారం దక్కింది. ఉత్తమ నటిగా శ్రీదేవి ఎంపికైంది. ఆమె చివరి చిత్రం `మామ్` ఈ పురస్కారం తెచ్చిపెట్టింది. ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని వినోద్ ఖన్నాకి ప్రకటించారు. ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరిలో ఘాజీ ని పురస్కారం వరించింది.