చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ నాయకులు.. మరో అడుగు ముందుకేశారు. ఆపరేషన్ ప్రకాశం జిల్లాను దాదాపుగా పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేలను.. నయానో.. భయానో… వైసీపీలో చేరేందుకు ఒప్పించారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ పరువు నిలిపిన మొదటి జిల్లా ప్రకాశం. ఆ జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగింటిలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. మరే జిల్లాలోనూ.. నాలుగు స్థానాలు రాలేదు. ఈ నలుగురిలో.. కనీసం ముగ్గురిని తమ పార్టీలో చేర్చుకోవాలని… వైసీపీ నాయకత్వం.. కొన్నాళ్లుగా స్కెచ్ వేసింది.
ముందుగా కొంత మందితో చర్చలు జరిపిన.. వైసీపీ నేతలకు.. సానుకూల స్పందన రాలేదు. దాంతో.. అధికారం ప్రయోగించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను టార్గెట్ చేసి.. ఆయన వ్యాపారాలపై విజిలెన్స్ ను ప్రయోగించారు. గ్రానైట్ వ్యాపారంలో ఆయన ఉండటంతో.. ఆయన క్వారీల్లో.. నెల రోజులుగా.. అధికారులు..మకాం వేసి.. సోదాల పేరుతో… కాలక్షేపం చేస్తున్నారు. ఆయన పార్టీలో చేరుతానని గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే.. అవి ఆగుతాయని.. సూచనలు పంపారు. ఇక పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతోనూ వైసీపీ నేతలు చర్చలు జరిపారంటున్నారు. ఆయనకు ఉన్న వ్యాపార అవసరాలు.. ఇతర కారణాలతో.. ఆయనతోనూ.. చర్చలు ఫలప్రదం అయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఇంకో విశేషం.. ఏమిటంటే.. ఈ జాబితాలో … చీరాల ఎమ్మెల్యే కరణం బాలకృష్ణమూర్తి పేరును కూడా వైసీపీ నేతలు తెరపైకి తీసుకు వచ్చారు. ఆయననూ ఆహ్వానించామని.. ఆయన కూడా.. సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కానీ.. గొట్టిపాటి, కరణం … ఇద్దరూ వైసీపీలో చేరడం అయితే.. కష్టమని ప్రకాశం రాజకీయాలపై అవగాహన ఉన్న వాళ్లు అంచనా వేస్తున్నారు. మొత్తానికి.. వైసీపీ నేతలు.. ఆపరేషన్ ప్రకాశంను.. దాదాపుగా పూర్తి చేశారని అంటున్నారు. నేడో..రేపో.. ఆ ఎమ్మెల్యేలు సీఎంను కలుస్తారని చెబుతున్నారు.