తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి .. ఈ పేరు ఏపీలో సాధారణ ప్రజలకు తెలియదు కానీ.. మీడియా సర్కిల్స్‌లో అందరికీ తెలుసు. ఎందుకంటే జగన్ రెడ్డి సీఎం అవగానే ఐ అండ్ పీఆర్ కమిషనర్ అయిపోయారు. ఆయన ఏపీ ఉద్యోగి కాదు. కేంద్ర ప్రభుత్వ సమాచార శాఖలో ఓ ఉద్యోగి. జగన్ సీఎం కాగానే ఏపీలో వాలిపోయారు. ఆయన చేతుల మీదుగానే సాక్షికి వందల కోట్లు ధారబోశారు. ఇంకా లెక్కలేనన్ని బాగోతాలు చేశారు. ఆయన ధైర్యం ఎలా ఉండేదంటే.. జగన్ రెడ్డి బతికున్నంత కాలం సీఎంగా ఉంటారని అనుకున్నారు.
అందుకే ఎన్నికలకు ముందు డిప్యూటేషన్ పొడిగించాలంటూ.. మాతృశాఖకు సిఫారసు చేయించుకుని ఆమోదం తెచ్చుకున్నారు. అంటే మరో రెండేళ్ల పాటు ఏపీలోనే ఉండాలనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది. భయంతో వెంటనే తన డిప్యూటేషన్ రద్దు చేయాలని .. తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని మాతృశాఖకు మొరపెట్టుకున్నారు. సీఎస్ జవహర్ రెడ్డి కుట్ర పూరితంగా ఆయనను రిలీవ్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తర్వాత చంద్రబాబు ఆగ్రహంతో క్యాన్సిల్ చేశారు.
కానీ ఆయన పాత ఆదేశాలను పట్టుకుని ఢిల్లీకి పోయి తన ఉద్యోగంలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నించారు. కానీ వాళ్లు ఏపీ ప్రభుత్వం నుంచి రిలీవ్ లెటర్ తెచ్చుకోవాలని చెప్పేశారు. జాయిన్ చేసుకునేది లేదని చెప్పారు. దాంతో విజయ్ కుమార్ రెడ్డిల మళ్లీ తిరిగి వచ్చారు. ఇక్కడా ఆయనకు పోస్టింగ్ లేదు. ఏదో ఒకటి చేయాలని ఆయన సెక్రటేరియట్లో తనకు తెలిసిన వాళ్ల దగ్గర కాళ్లా వేళ్లా పడుతున్నాడు. ఆయన పరిస్థితి చూసి మిగిలిన వాళ్లు నవ్వుకుంటున్నారు.