రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత తెలుగులో పట్టు సాధించడానికి చాలా మంది తమిళ స్టార్స్ ప్రయత్నించారు. సూర్య, కార్తి, విక్రమ్ కొంత పట్టు సాధించారు. వీరి తర్వాత లిస్టు లో విజయ్ కూడా వున్నాడు. అయితే అజిత్ మాత్రం ఈ రేసులో పెద్దగా శ్రద్ద కనబరచడం లేదు. అజిత్ క్రేజు తమిళంలో మాములుగా వుండదు. అజిత్ సినిమా అంటే అక్కడ థియేటర్లు దద్దరిల్లిపొతుంటాయి. అజిత్ అంటే తెలుసు ప్రేక్షకులకు కూడా ఇష్టమే. ‘ప్రేమలేఖ’ సినిమా నుండే అజిత్ అంటే ఒక ఇష్టం ఏర్పడింది. అయితే అజిత్ మాత్రం తెలుగు పై పెద్ద శ్రద్ధ, ఆసక్తి చూపినట్లు కనిపించదు.
దీనికి తాజా నిదర్శనం అజిత్ ‘తునివు’ సినిమా. ఈ సినిమా సంక్రాంతికి తమిళంలో విడుదలౌతుంది. నిన్నటి వరకూ తెలుగు వెర్షన్ కి సంబధించిన అలికిడి లేదు. ఐతే సడన్ గా రాధాకృష్ణ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తునివు తెలుగు హక్కులు తీసుకుంది. మూడు కోట్ల రూపాయిలకే ఇచ్చేశారని టాక్. మూడు కోట్లు అంటే బయ్యర్లకు కిట్టుబాటు ధరే. ఐతే రేటు మాటని పక్కన పెడితే.. అసలు ‘తునివు’ బరిలో వుందని ప్రచారమే లేదు. అజిత్ ప్రమోషన్స్ కోసం ఆసక్తి చూపరు. ఇదే కాదు., అజిత్ గత సినిమాల విషయంలో ఇదే జరిగింది. కనీసం తెలుగు టైటిల్ పెట్టాలనే ఆసక్తి కనిపించదు. ‘వలిమై’ సినిమాని అదే పేరుతో వదిలేశారు. నిజానికి ఆ సినిమా బావుంది. కానీ కావాల్సిన బజ్ ని క్రియేట్ చేయలేకపోయారు. ఇప్పుడు ‘తునివు’కైనా ఒక తెలుగు టైటిల్ పెట్టి కొద్దిపాటి ఆసక్తి చేస్తారో.. లేదో అలానే వదిలేస్తారో చూడాలి.