ఏపీలో ఆన్ లైన్ టికెటింగ్ వ్యవహారం మరోసారి కోర్టు మెట్లెక్కింది. సినిమా టికెట్లను ఆన్ లైన్ ద్వారానే విక్రయించాలంటూ కొత్త నిబంధన చేరుస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఓ జీవో జారీ చేసింది. ఈ జీవోని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలన్న ఉద్దేశంతో థియేటర్ యజమానులపై ఒత్తిడి తీసుకొస్తోంది. సంతకాలు చేయడానికి నిరాకరించినందుకు ఏపీలోని చిలుకూరు పేటలో 5 థియేటర్లకు అధికారులు సీలు వేశారు. తాజాగా ఈ జీవోని సవాల్ చేస్తూ హైకోర్టులో మరో వాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంపై బిగ్ బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ హై కోర్టుని ఆశ్రయించింది.
మంగళవారం ఈ వాజ్యంపై వియారణ జరిపిన ధర్మాసనం ప్రతివాదులుగా ఉన్న న్యాయ, శాసనశాఖ కార్యదర్శి, ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డవలెప్మెంట్ కార్పొరేషన్ లతో పాటుగా ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్లకు నోటీసులు జారీ చేసింది. వెంటనే దీనిపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదే వ్యవహారంపై మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యాలు గతంలో దాఖలు చేసిన వాజ్యంతో కలిపి ప్రస్తుత వాజ్యాన్ని విచారి్తామని పేర్కొంది. తదుపరి విచారణకు ఈనెల 27కు వాయిదా వేసింది. ఆరోజున విచారణలో ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసే అంశాన్ని పరీశీలిస్తామని స్పష్టం చేసింది.