వచ్చే ఎన్నికల్లో రోజాకు టిక్కెట్ ఉందో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆమెకు టిక్కెట్ ఎగ్గొట్టేందుకు స్క్రీన్ ప్లే మాత్రం ప్రారంభమయిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నగరి నియోజవర్గంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు సాక్ష్యం. పుత్తూరు మున్సిపాలిటీకి చెందిన ఓ మహిళా దళిత కౌన్సిలర్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టారు. రోజా మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తామని డబ్బులు తీసుకున్నారని కానీ ప దవి ఇవ్వలేదని ఆరోపించారు. తీసుకున్న డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలను దళిత మహిళా కౌన్సిలర్ స్పందించారు.
మరో వైపు చిత్తూరు జడ్పీ సమావేశంలో నగరికి చెందిన జడ్పీటీసీలు రోజాపై ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే, మంత్రిరోజా.. పనులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ చేయనివ్వడం లేదని.. వేధిస్తున్నారని మండిపడ్డారు. ఆమెకు మళ్లీ టిక్కెట్ ఇస్తే ఓడిస్తామని చాలెంజ్ చేశారు. నిజానికి రోజాకు.. నియోజకవర్గంలో ఏ ఒక్క నేతతోనూ సంబంధాలు ఉండవు. అందరితోనూ గొడవలే. పైగా పార్టీ పదవుల కోసం డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
నియోజకవర్గంలో ఆమెపై తీవ్ర అసంతృప్తి ఉందని.. ఆమెకు ఎదురుగాలి వీస్తోందని అనేక సర్వేలు వెల్లడించాయి. దీంతో ఆమెకు టిక్కెట్ ఇవ్వకూడదని అనుకుంటున్నారు. కానీ రోజా చేసే రచ్చ పార్టీకి డ్యామేజ్ అవుతుందని వెనుకడుగు వేస్తున్నారు. కానీ ఇప్పుడు మార్చాలనుకోవడంతో.. మెల్లగా రోజాకు వ్యతిరేకంగా ఉన్న వారిని తెరపైకి తెస్తున్నారని అంటున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కూడా రోజా మళ్లీ పోటీ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారు.