మెట్రో సిటీలు ఊహించనంత వేగంగా అభివృద్ధి సాధిస్తున్నాయి. అయితే ఇప్పుడు దేశంలో కొత్తగా వస్తున్న మార్పు ద్వితీయశ్రేణి నగరాలు కూడా శరవేగంగా విస్తరించడం. దీనికి కారణం అనేక మల్టీ నేషనల్ కంపెనీలు తమ ఆఫీసుల్ని విభజిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో శాటిలైట్ ఆఫీసుల్ని పెట్టి ఉద్యోగుల్ని నియమించుకుంటున్నాయి. మెల్లగా అవి మెట్రోలుగా మారడానికి ఓ దారి ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ, తిరుపతి, విజయవాడ, వరంగల్ వంటి నగరాల్లో ఎవరూ ఊహించనంత వృద్ధి కనిపిస్తోంది.
తక్కువ ధరకే భూములు లభించడం.. అందుబాటు అద్దెలకే ఇళ్లు, ఆఫీసులు దొరకడం వంటి కారణాలు ఈ నగరాల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ప్రధాన నగరాల్లోని రేట్లతో పోలిస్తే టైర్-2 నగరాల్లో అద్దెలు దాదాపు సగమే. నైపుణ్యం కలిగిన ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. కరోనా తర్వాత చాలామంది ఉద్యోగులు తమ కుటుంబాలకు దగ్గరగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో కంపెనీలు సైతం తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్, హైబ్రిడ్ మోడల్స్ అమలు చేస్తూ.. ఉద్యోగుల ఊళ్లకు దగ్గరగా టైర్-2 నగరాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖలో ఇన్ఫోసిస్ శాటిలైట్ ఆఫీస్ ఏర్పాటు ేచసింది.
టైర్-2 నగరాల్లో పెట్టుబడులు పెడితే చక్కని లాభాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతులు, అందుబాటు ధరలో ఇళ్లు లభించడం వంటివి మరో అంశం. దేశవ్యాప్తంగా టైర్-2 నగరాలుగా పేరు పొందిన సిటీలు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్స్ గా మారుతాయని నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు.