స్టువర్టుపురం… దొంగలకు అడ్డా. ఒకప్పుడు దక్షిణాదికి ఇది నేర రాజధాని. అక్కడ టైగర్ నాగేశ్వరరావు అనే ఓ గజదొంగ ఉండేవాడు. తన గురించి చరిత్ర కథలు కథలుగా చెబుతుంది. ఇప్పుడు వాటినే వెండి తెరపై `టైగర్ నాగేశ్వరరావు` సినిమాగా రూపొందిస్తున్నారు. రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఇది. వంశీ దర్శకుడు. ఫస్ట్ లుక్తో పాటు.. గ్లిమ్స్ ఈరోజు విడుదలయ్యాయి. వెంకటేష్ వాయిస్ ఓవర్ తో ఈ గ్లిమ్స్ ప్రారంభమైంది. 1970లోని స్టువర్టుపురంని పరిచయం చేస్తూ… ఈ గ్లిమ్స్ని రూపొందించారు. విజువల్స్ పవర్ఫుల్గా ఉన్నాయి. చివర్లో రవితేజ డైలాగ్ మరింత పదునుగా వినిపించింది. `జింకని వేటాడే పులిని చూసుంటావు.. పులిని వేటాడే పులిని చూశావా` అంటూ.. ఈ గ్లిమ్స్కి ఓ ఎనర్జిటిక్ ఎండింగ్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమా కాన్సెప్ట్ మొత్తం.. ఈ చిన్న వీడియోలోనే చూపించేశారు. జీవి ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ కలిగించింది. నపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత. అక్టోబరు 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.