ఇది వరకు అనుపమ పరమేశ్వరన్ అంటే పద్ధతైన పాత్రలే గుర్తొచ్చేవి. కట్టూ, బొట్టు, నటన వీటిలో ఎక్కడా శ్రుతిమించలేదు. అఫ్కోర్స్… ఇప్పటికీ అంతే. కానీ బోల్డ్ సీన్స్‌లో నటించడానికి ఇప్పుడు ఏమాత్రం అభ్యంతరం చెప్పడం లేదు. మొన్నటికి మొన్న ‘రౌడీ బోయ్స్’లో హాట్ లిప్ లాక్ సీన్లలో రెచ్చిపోయింది. మన అనుపమేనా ఇదంతా చేస్తోంది? అంటూ కుర్రాళ్లు కళ్లింతింత చేసుకొని, ఆ సీన్స్ చూశారు. ఇప్పుడు అదే సీన్ ‘టిల్లు స్క్వేర్’లోనూ రిపీట్ అయ్యింది.
డీజే టిల్లులో రాధిక పాత్రలో నేహా శెట్టి చాలా హాట్ గా కనిపించింది. ఆ సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించింది. ఆ సినిమా సీక్వెల్ లో నేహా లేదు. ఆ ప్లేసులోకి అనుపమ వచ్చింది. అయితే హాట్ నెస్ మాత్రం తగ్గలేదు. పైగా రెట్టింపు అయ్యింది.’టిల్లు స్క్వేర్’ ట్రైలర్లో సిద్దు కామెడీతో పాటు.. అనుపమ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా కార్లో ముద్దు సీన్ గురించి కుర్రాళ్లు అప్పుడే చర్చ మొదలెట్టేశారు. అనుపమ బాగా ముదిరిపోయిందని, ఇంకెన్నెన్ని చూడాల్సివస్తోందో అని హాట్ గా చర్చించుకొంటున్నారు. సోషల్ మీడియాలో అనుపమకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అనుపమ ఏం చేసినా వాళ్లు వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం టిల్లులో ఈ కార్ సీన్ ని వాళ్లే బాగా వైరల్ చేస్తున్నారు. హీరోయిన్లు ముద్దు సీన్లలో రెచ్చిపోవడం మామూలే. కానీ అనుపమ లాంటి కథానాయికలు కూడా ఈ లిస్టులో చేరిపోవడమే ఇప్పటి ట్రెండ్. మున్ముందు ఇంకెన్ని చూడాలో..?!