హైదరాబాద్: ఇంటర్నెట్ను కనుగొన్న టిమ్ బెర్నర్స్-లీ భారత్‌ను అభినందించారు. నెట్ న్యూట్రాలిటీని సమర్థిస్తూ ట్రాయ్ నిన్న తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ ఇవాళ ట్వీట్ చేశారు. కొంతమంది బ్రాండెడ్ ఇంటర్నెట్ను అందజూపుతున్నారని, అది ఇంటర్నెట్ కాదంటూ పరోక్షంగా ఫేస్బుక్నుద్దేశించి వ్యాఖ్యానించారు. ఉద్దేశ్యపూర్వకంగా నెట్‌వర్క్‌లోని కొంత భాగానికి మాత్రమే డేటా కనెక్టివిటీ ఇవ్వటం తన దృష్టిలో తిరోగమనమని పేర్కొన్నారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ రేట్లను తగ్గించాలనుకుంటే ఇతర మార్గాలున్నాయని వ్యాఖ్యానించారు. నెట్ న్యూట్రాలిటీ కొరకు పటిష్ఠమైన నిబంధనలను రూపొందించటం అభినందనీయమని పేర్కొన్నారు. టిమ్ బెర్నర్స్ గతంలో కూడా ఫేస్‌బుక్‌కు చెందిన ఫ్రీ బేసిక్స్ పథకాన్ని వ్యతిరేకించారు. అవి పాక్షికంగా మాత్రమే డేటాను అందిస్తున్నందున ఇంటర్నెట్ వినియోగదారులు ఆ పథకాన్ని తిరస్కరించాలని పిలుపునిచ్చారు. భారత్‌లో దేశవ్యాప్తంగా ఫ్రీ బేసిక్స్ పేరుతో విస్తరించాలని ఫేస్ బుక్ ఒక పథకాన్ని రూపొందించగా, దానికి వ్యతిరేకంగా నిన్న టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) నిర్ణయం తీసుకుంది.