తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ పరిస్థితిని తన రాజకీయ అనుభవంతో.. అంచనా వేయడం కన్నా… ఇటీవలి కాలంలో సర్వేల మీదే ఎక్కువ ఆధార పడుతున్నారు. ఈ విషయం ఇటీవల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు… వేసిన అడుగులు చూస్తే అర్థమయిపోతుంది. అయితే ఈ సర్వేలు ఎంత మేర నిజమవుతున్నాయో కానీ.. తలుగుతున్న ఎదురుదెబ్బలు చూస్తే మాత్రం మార్చుకోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయని మాత్రం అర్థం అయిపోతోంది.
నంద్యాలతో వచ్చింది తెలంగాణతో పోయింది..!
నంద్యాల ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వచ్చిన పాజిటివ్ వైబ్స్ మొత్తం.. తెలంగాణ ఎన్నికల్లో … క్రెడిట్ కోసం ఎక్కువగా జోక్యం చేసుకోవడం వల్ల పోయింది ఇంకా చెప్పాలంటే.. మైనస్ లోకి పడిపోయింది. తెలంగాణ ఎన్నికల ప్రబావం ఏపీపై ఉండకపోయినప్పటికీ… పార్టీ నేతల్లో మాత్రం ఆత్మవిశ్వాససం దిగజారిపోవడానికి కారణం అయిపోతోంది. తెలంగాణ ఎన్నికల్లో ఏకపక్షంగా ఉంటుందన ఎవరూ ఊహించలేరు. ఏపీ ఎన్నికల్లో అయితే.. ఇంకెవరూ ఊహించలేరు. అక్కడ గట్టి పోటీ ఉంటుందని.. ఎవర్నీ అడిగినా ఊహించేస్తారు. దానికి సర్వేలు అక్కర్లేదు. ఎందుకంటే.. ఏపీలో సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ. ఎంత అభివృద్ధి అయింది..? ఎవరు చేశారన్నది..? చాలా పరిమిత వర్గాలకు మాత్రమే ఆసక్తిరమైన అంశం.అక్కడ అంతా సోషల్ ఇంజినీరింగ్ కీలకం,. ఇటీవలి కాలంలో ఈ సోషల్ ఇంజినీరింగ్ విషయంలో టీడీపీ వెనుకబడిపోయిందన్న విశ్లేషణలు గట్టిగానే వస్తున్నాయి.
సోషల్ ఇంజినీరింగ్ రెండు శాతానికిపైగా తేడా..!
ఇటీవలి కాలంలోఓ ప్రముఖ టీవీ చానల్ చేసిన అభిప్రాయసేకరణలో.. టీడీపీ రెండు శాతం వెనుకబడిందన్న విశ్లేషణ తేలడం ఆశ్చర్యం కలిగిస్తోంది. బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ లో సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఓ సామాజికవర్గం.. అలాగే పవన్ కల్యాణ్ కారణంగా మరో సామాజికవర్గంలో టీడీపీ 70 శాతం వరకూ మద్దతు కోల్పోయింది. ఇక ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు గత ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేశారు. ఈ సారి వారిలో కాస్తంత మార్పు కనిపిస్తున్నప్పటికీ.. అది తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా లేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చాలా కీలకంగా పని చేయాల్సి ఉందన్న విషయంపై మాత్రం.. తెలుగుదేశం పార్టీ వర్గాలు చాలా క్లియర్ గానే ఉన్నాయి. కొత్తగా కొన్ని సామాజికవర్గాల మద్దతు కూడగట్టుకోవడంతో పాటు.. ఇప్పటికే అండగా ఉంటున్న సామాజికవర్గాలను.. మరితం బలమైన మద్దతుదారులుగా మల్చుకోకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తడం ఖాయమన్న అంచనాలున్నాయి.
వచ్చే పోయే లెక్కలు జగన్ పక్కాగా వేసుకున్నారా..?
జగన్మోహన్ రెడ్డి సోషల్ ఇంజినీరింగ్ లో పకడ్బందీగానే వ్యవహరిస్తున్నారని.. ఆయనకు మద్దతుగా ఉంటున్న వారిలో ఏ మాత్రం మార్పు రాకపోవడాన్ని బట్టి అంచనా వేయవచ్చని విశ్లేషణలో తేలింది. కాపు సామాజికవర్గం దూరం అవుతుందని.. తెలిసినా.. రిజర్వేషన్లతో పాటు పవన్ పైనా వ్యక్తిగత విమర్శలు చేశారు. అయితే అంతకు ముందు వారు ఇచ్చిందీ లేదు.. ఇప్పుడు పోయేదేమీ లేదన్నట్లుగా జగన్ లైట్ తీసుకున్నారు. ఇది తనకు మద్దతుగా ఉంటున్న వారిలో మరితం బలమైన మద్దతు పొందగలిగేలా చేసిందంటున్నారు.
రెండు, మూడు నెలల్లోనే జాతకం మార్చుకోవాలా..?
చంద్రబాబు ఇప్పుడు రెండు శాతం కాదు..అంతకు మించిన మద్దతును రెండు, మూడు నెలల వ్యవధిలోనే పొందాల్సి ఉంటుంది. దీని కోసం.. కొత్తగా ఏం చేయాలన్నదానిపై ఆయన దృష్టి పెట్టి… సీరియస్ గా వ్యూహాలు అమలు చేస్తే తప్ప…టీడీపీ గండం గట్టెక్కడం కష్టమవుతుంది. సంక్షేమ పథకాలు.. అన్ని వర్గాలకూ అందుతున్నాయి. కానీ వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకునే ప్రక్రియను.. మాత్రం మరింత వేగంగా చేయాల్సి ఉంది. మరి ఈ విషయాలన్నీ చంద్రబాబుకు తెలియనివి కావు. కానీ ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ లో… పోతే మాత్రం.. పట్టించుకోకపోయే ప్రమాదం ఉంది. చంద్రబాబు ఏం చేసినా.. రెండు , మూడు నెలల్లోనే మూడు నుంచి నాలుగు శాతం మద్దతు పెంచుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంది.