వైసీపీ హయాంలో దేవుడ్ని ఎలా దోచుకున్నారో విజిలెన్స్ బయటకు తీస్తోంది. మిగతా విషయాలు పక్కన పెడితే అసలు దర్శనం పేరుతో ఎలా దోపిడీ చేశారో పత్రాలతో సహా బయటకు వస్తున్నాయి. టీటీడీ కొత్త ఈవో శ్యామలరావు విజిలెన్స్ బృందాలకు పెద్ద పని పెట్టారు. నాలుగైదు విభాగాలుగా మార్చి అన్నింటిలోనూ లెక్కలు బయటకు తీయిస్తున్నారు. ఇలా దర్శనాల్లో చేసిన దందాల గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల పేర్లతో వచ్చిన సిఫారసు లేఖలు వెలుగులోకి వస్తున్నాయి.
కొద్ది రోజుల కిందట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్క లేఖ మీద వంద మందిని వీఐపీ దర్శనానికి పంపించిన సిఫారసు లేఖ వెలుగు చూసింది. తాజాగా పెద్దిరెడ్డి కూడా అలాంటి లేఖలు రాసి వందల మందిని దర్శనానికి పంపించారు. ఇలాంటి దందాలు లెక్కలేనన్ని సాగాయని ఇదో వ్యాపారంగా అనేక మంది మార్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి రోజా ఈ దందాలో ఉన్నారు. ఆమె దర్శనాలను ఎలా అమ్ముకున్నారో లెక్కలు బయటకు తీస్తున్నారు.
మామూలుగా వీఐపీ దర్శన టిక్కెట్ పదివేలు … ఆ మొత్తం నేతలు వసూలు చేసి దర్శనాలకు పంపుతున్నారు. ఇలా రోజుకు ఎంత మందిని పంపారన్నది లెక్కలు తీస్తున్నారు. ఎవరెవరు పంపారు.. అన్న వివరాలు సేకరిస్తున్నారు. రోజాతో పాటు దర్శనానికి ఎంత మంది వచ్చారు.. అనే వివరాలు కూడా వెలుగులోకి తెస్తున్నారు. దాదాపుగా ప్రతి వారం రోజా దర్శనానికి వచ్చేవారు. ఇలా మొత్తం … దర్శనాల పేరుతోనే భక్తులను నిలువుదోపిడీ చేసినట్లుగా గుర్తించారు. తిరుమలలో బయటపడబోయే దందాలు.. సంచలనం సృష్టిస్తాయని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి.